Commonwealth Games: భారత అథ్లెటిక్స్‌కు కామన్వెల్త్ క్రీడల్లో మరో చారిత్రక ఘట్టం చేరింది. పురుషుల 10 వేల మీటర్ల పరుగులో భారత అథ్లెట్ గుల్వీర్ సింగ్(Gulveer Singh) రజత పతకం గెలిచి కొత్త రికార్డు సృష్టించాడు. ఈ విభాగంలో పతకం సాధించిన తొలి భారతీయుడిగా నిలిచిన గుల్వీర్.. దేశానికి అరుదైన విజయాన్ని అందించాడు. గ్లాస్‌గోలోని స్కాట్‌స్టోన్ స్టేడియంలో భారీ వర్షం మధ్య జరిగిన ఫైనల్లో అతడు 27:49.78 నిమిషాల్లో రేస్ పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచాడు. ఆస్ట్రేలియాకు చెందిన కై రాబిన్‌సన్ 27:48.93 టైమ్‌తో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకోగా, గుల్వీర్ కేవలం స్వల్ప తేడాతో గోల్డ్‌ను చేజార్చుకున్నాడు.
వాతావరణం గురించి ఆలోచించలేదు.. పతకం గెలవడమే లక్ష్యం
జాతీయ రికార్డు హోల్డర్ అయిన గుల్వీర్ ప్రదర్శనతో భారత్‌కు అథ్లెటిక్స్‌లో మరో సిల్వర్ మెడల్ లభించింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన గుల్వీర్ ప్రస్తుతం భారత ఆర్మీలో సేవలందిస్తున్నాడు. అమెరికన్ కోచ్ స్కాట్ సిమ్మన్స్ పర్యవేక్షణలో శిక్షణ పొందుతున్న అతడు, ఇప్పుడు 5 వేల మీటర్ల ఈవెంట్‌పై దృష్టి పెట్టినట్లు తెలిపాడు. “వర్షం, వాతావరణం గురించి ఆలోచించలేదు.. పతకం గెలవడమే లక్ష్యంగా పరుగెత్తాను” అని గుల్వీర్ ఆనందం వ్యక్తం చేశాడు. మరో విశేషం ఏమిటంటే.. 1986 తర్వాత తొలిసారి కామన్వెల్త్ 10 వేల మీటర్ల పోటీలో ఆఫ్రికా అథ్లెట్ పోడియంపై లేకపోవడం ఈ రేసుకు ప్రత్యేకతను తీసుకొచ్చింది.









