Thursday, July 16, 2026
Chat on WhatsApp
HomeSportsPV Sindhu | పీవీ సింధు దూకుడు.. 35 నిమిషాల్లో మ్యాచ్ ముగించి క్వార్టర్ ఫైనల్‌కు

PV Sindhu | పీవీ సింధు దూకుడు.. 35 నిమిషాల్లో మ్యాచ్ ముగించి క్వార్టర్ ఫైనల్‌కు

-

Chat on WhatsApp

భారత బ్యాడ్మింటన్ దిగ్గజం పీవీ సింధు(PV Sindhu) జపాన్ ఓపెన్ సూపర్ 750 టోర్నీలో అదిరిపోయే ఆటతీరుతో ముందుకు సాగుతోంది. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్ హాన్ యూయే (చైనా)పై వరుస గేమ్‌లలో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. ఈ విజయంతో టోర్నీలో భారత్ తరఫున మిగిలిన ఏకైక క్రీడాకారిణిగా సింధు నిలిచింది. మ్యాచ్ ఆరంభంలో ఇద్దరు ఆటగాళ్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. హాన్ యూయే ఆధిపత్యం కోసం ప్రయత్నించినా.. సింధు తన అనుభవాన్ని ఉపయోగించుకుని అద్భుతంగా పుంజుకుంది. కచ్చితమైన షాట్లు, వేగవంతమైన ఆటతో ర్యాలీలపై పట్టు సాధించిన సింధు తొలి గేమ్‌ను 21-16తో కైవసం చేసుకుంది.

రెండో గేమ్‌లో సింధు మరింత దూకుడుగా ఆడి వరుసగా ఎనిమిది పాయింట్లు సాధించి 8-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ప్రత్యర్థి పోరాడినా సింధు ఎక్కడా ఒత్తిడికి గురికాలేదు. చివరకు రెండో గేమ్‌ను 21-14తో గెలిచి కేవలం 35 నిమిషాల్లో మ్యాచ్‌ను ముగించింది. హాన్ యూయేపై సింధు హెడ్ టు హెడ్ రికార్డు 8-1కి చేరింది. ప్రపంచ పదో ర్యాంక్‌లో ఉన్న సింధు క్వార్టర్ ఫైనల్లో జపాన్ మాజీ ప్రపంచ ఛాంపియన్ నొజోమీ ఒకుహారాతో తలపడనుంది. ప్రపంచ నంబర్ వన్ అన్ సె యంగ్ టోర్నీ నుంచి వైదొలగడంతో ఒకుహారా తదుపరి దశకు చేరుకుంది. మరోవైపు మిక్స్‌డ్ డబుల్స్‌లో ధ్రువ్ కపిలా-తనీషా క్రాస్టో జోడీ ఓటమితో నిష్క్రమించింది. లక్ష్యసేన్, ఆయుష్ శెట్టి, ఉన్నతి హూడా కూడా తొలి రౌండ్‌లోనే పరాజయం పాలయ్యారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Heavy rain clouds over Andhra Pradesh during monsoon season

AP Weather Update | బంగాళాఖాతంలో అల్పపీడనం.. మూడు రోజుల పాటు వర్షాలు కురిసే...

AP Weather Update: బంగాళాఖాతంలో నెలకొన్న బలమైన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో మరో మూడు రోజుల పాటు వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రధానంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో...
- Advertisement -
Chat on WhatsApp