Thursday, July 16, 2026
Chat on WhatsApp
HomeSportsPondicherry Premier League | 35 బంతుల్లో కాదు.. 34 బంతుల్లోనే సెంచరీ అది ఎవరంటే...

Pondicherry Premier League | 35 బంతుల్లో కాదు.. 34 బంతుల్లోనే సెంచరీ అది ఎవరంటే ?

-

Chat on WhatsApp

టీ20 క్రికెట్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు అమన్ ఖాన్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి అందరి దృష్టిని ఆకర్షించాడు. పాండిచ్చేరి ప్రీమియర్ లీగ్‌(Pondicherry Premier League)లో అద్భుతమైన బ్యాటింగ్‌తో కేవలం 34 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి సరికొత్త రికార్డు నెలకొల్పాడు. మొత్తం 43 బంతులు ఎదుర్కొన్న అమన్ ఖాన్ 129 పరుగులతో అజేయంగా నిలిచి ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ ఇన్నింగ్స్‌తో భారత టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి చేరుకున్నాడు.

ఇప్పటి వరకు మూడో స్థానంలో ఉన్న యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని వెనక్కి నెట్టి ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ జాబితాలో తెలంగాణ టీ20 లీగ్‌లో హైదరాబాద్‌కు చెందిన అమన్ రావు 32 బంతుల్లో సెంచరీ చేసి తొలి స్థానంలో కొనసాగుతున్నాడు. వైభవ్ సూర్యవంశీ 35 బంతుల్లో సెంచరీతో మూడో స్థానంలో ఉన్నాడు. అమన్ ఖాన్ మెరుపు ఇన్నింగ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, క్రికెట్ అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా, ఐపీఎల్ మినీ వేలంలో అమన్ ఖాన్‌ను చెన్నై సూపర్ కింగ్స్ రూ.40 లక్షల బేస్ ధరకు కొనుగోలు చేసింది. ఈ ఇన్నింగ్స్‌తో రాబోయే ఐపీఎల్ సీజన్‌లో కూడా అతనిపై అంచనాలు మరింత పెరిగాయి.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Telangana government will launch the ‘Tholimudda’ breakfast scheme in Anganwadi centres from August to improve child nutrition and strengthen childcare facilities across the state.

Tholimudda | అంగన్‌వాడీ చిన్నారులకు ‘తొలిముద్ద’ అల్పాహారం.. ఎప్పటినుంచి అంటే ?

తెలంగాణలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారుల పోషకాహారాన్ని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు నెల నుంచి అంగన్‌వాడీల్లో ‘తొలిముద్ద’(Tholimudda) అల్పాహార పథకాన్ని ప్రారంభించనున్నట్లు రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క(Minister...
- Advertisement -
Chat on WhatsApp