Thursday, July 16, 2026
Chat on WhatsApp
HomeSportsIndia vs England | భారత్-ఇంగ్లాండ్ రెండో వన్డే.. గెలిస్తే సిరీస్,లేదంటే ?

India vs England | భారత్-ఇంగ్లాండ్ రెండో వన్డే.. గెలిస్తే సిరీస్,లేదంటే ?

-

Chat on WhatsApp

India vs England: కార్డిఫ్(Cardiff) వేదికగా జరగనున్న భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో వన్డేలో తలపడేందుకు  రంగం సిద్ధమైంది. తొలి వన్డే మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం కాగా, రెండో వన్డే సమయాల్లో మార్పు చేశారు. ఈ మ్యాచ్ సాయంత్రం 5:30 గంటలకు ప్రారంభం కానుంది. టాస్‌ను 5 గంటలకు వేయనున్నారు. కార్డిఫ్ పిచ్‌పై టాస్ గెలిచిన జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకోవడం ప్రయోజనకరంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. తొలి వన్డేలో గాయంతో ఇబ్బంది పడిన భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కోలుకుని రెండో మ్యాచ్‌కు అందుబాటులోకి వచ్చాడు. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధిస్తే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది.

ఒకవేళ ఇంగ్లాండ్ గెలిస్తే సిరీస్ విజేతను నిర్ణయించేందుకు మూడో వన్డే వరకు వేచి చూడాల్సి ఉంటుంది. భారత జట్టు బ్యాటింగ్ విభాగంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ కీలకంగా మారనున్నారు. బౌలింగ్‌లో జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణతో పాటు అర్ష్‌దీప్ సింగ్ లేదా ఇతర యువ ఆటగాళ్లకు అవకాశం లభించే అవకాశం ఉంది.

రెండో వన్డే కోసం టీమిండియా అంచనా ప్లేయింగ్ ఎలెవన్:
కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నేతృత్వంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, శివమ్ దూబే, ప్రసిద్ధ్ కృష్ణ, గురునూర్ బ్రార్/ప్రిన్స్ యాదవ్/అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా జట్టులో ఉండే అవకాశాలు ఉన్నాయి.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

pv sindhu playing badminton match at japan open super 750 tournament

PV Sindhu | పీవీ సింధు దూకుడు.. 35 నిమిషాల్లో మ్యాచ్ ముగించి క్వార్టర్...

భారత బ్యాడ్మింటన్ దిగ్గజం పీవీ సింధు(PV Sindhu) జపాన్ ఓపెన్ సూపర్ 750 టోర్నీలో అదిరిపోయే ఆటతీరుతో ముందుకు సాగుతోంది. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్ హాన్ యూయే...
- Advertisement -
Chat on WhatsApp