Monday, July 20, 2026
Chat on WhatsApp
HomeNationalWomen Reservation Bill | మహిళలకు గుడ్ న్యూస్.. లోక్‌సభ ముందుకు రిజర్వేషన్ బిల్లు

Women Reservation Bill | మహిళలకు గుడ్ న్యూస్.. లోక్‌సభ ముందుకు రిజర్వేషన్ బిల్లు

-

Chat on WhatsApp

Women Reservation Bill: దేశ రాజకీయాల్లో కీలక మలుపు తీసుకొచ్చే పార్లమెంట్ ప్రత్యేక సమావేశం నేడు ప్రారంభమైంది. మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన వంటి కీలక అంశాలపై కేంద్ర ప్రభుత్వం మూడు ప్రధాన బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టింది.

సభ ప్రారంభమైన వెంటనే కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్‌వాల్, హోంమంత్రి అమిత్ షా ఈ బిల్లులను ప్రవేశపెట్టగా, అనంతరం వాటిపై చర్చ ప్రారంభమైంది.

ఈ ప్రతిపాదనల్లో లోక్‌సభ స్థానాలను ప్రస్తుత 550 నుంచి గరిష్ఠంగా 850 వరకు పెంచే అంశం ముఖ్యంగా నిలిచింది. 2011 జనాభా లెక్కలను ఆధారంగా తీసుకుని దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టే 131వ రాజ్యాంగ సవరణ బిల్లు కూడా ఇందులో భాగంగా ఉంది.

అలాగే పునర్విభజన కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కూడా ఈ ప్రక్రియను అమలు చేసే ప్రతిపాదనలు ఉన్నాయి.

ఈ బిల్లులపై సమగ్ర చర్చ కోసం పార్లమెంట్ మూడు రోజుల పాటు సమావేశం కానుంది. ప్రతి బిల్లుపై లోక్‌సభ, రాజ్యసభల్లో కలిపి సుమారు 18 గంటలపాటు చర్చ జరగనుంది.

ఈ కీలక అంశాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్‌సభలో తన అభిప్రాయాన్ని వెల్లడించనున్నారు.

దేశ రాజకీయ వ్యవస్థలో సమతుల్యత, మహిళల ప్రాతినిధ్యం పెంపు, ప్రజాప్రతినిధ్య వ్యవస్థలో మార్పులకు దారి తీసే ఈ బిల్లులు రాబోయే కాలంలో కీలక ప్రభావం చూపే అవకాశముంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Ebola outbreak in Congo

Congo Ebola | ఎబోలా ఎఫెక్ట్.. కాంగోలో రోజురోజుకూ పెరుగుతున్న మరణాలు

మధ్య ఆఫ్రికాలోని కాంగోను ఎబోలా(Congo Ebola) వైరస్ మరోసారి వణికిస్తోంది. కేసులు, మరణాలు పెరుగుతుండటంతో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.మే 15 తర్వాత కాంగోలో ఎబోలా కేసులు క్రమంగా పెరుగుతూ, మొత్తం బాధితుల సంఖ్య...
- Advertisement -
Chat on WhatsApp