వికసిత్ భారత్-2047 లక్ష్యాల సాధనలో భాగంగా కేంద్ర విద్యుత్ శాఖ నూతన జాతీయ విద్యుత్ విధాన ముసాయిదాను రూపొందించింది. ఈ ముసాయిదాను అన్ని రాష్ట్రాలకు పంపించి, వచ్చే నెల 20వ తేదీ వరకు అభిప్రాయాలు కోరింది.
విద్యుత్ కొనుగోలు ఖర్చులు పెరిగితే, ఆ భారం వినియోగదారుల నెలవారీ కరెంటు బిల్లుల్లో ప్రతిబింబించాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది.
ఉచిత కరెంటు సరఫరా వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ముందుగానే డిస్కంలకు చెల్లించాలని, లేకపోతే ఉచిత సరఫరాను నిలిపివేయాలని సూచించింది.
అలాగే ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలు వినియోగించే విద్యుత్ బిల్లులను సకాలంలో డిస్కంలకు చెల్లించాల్సిందిగా పేర్కొంది.
డిస్కంల గుత్తాధిపత్యాన్ని తొలగించేందుకు ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం (PPP) విధానాన్ని అమలు చేసి, విద్యుత్ సంస్థలను స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్ట్ చేయాలని ముసాయిదా సూచించింది.
also read:Putin on Greenland: అమెరికా ఆరోపణలపై స్పందించిన పుతిన్…గ్రీన్‌లాండ్ తో రష్యాకు సంబంధం లేదు
ఒకే ప్రాంతంలో అనేక డిస్కంలు పోటీగా కరెంటు సరఫరా చేసేందుకు ఈఆర్‌సీలు అనుమతించాలనింది.
2030 నాటికి ప్రతి వ్యవసాయ బోరు మరియు వాటికి సరఫరా చేసే ఫీడర్లకు సౌరవిద్యుత్ ఏర్పాటు చేయాలని, దీంతో రాయితీల భారం తగ్గుతుందని కేంద్రం పేర్కొంది.
విద్యుత్ పంపిణీ, సరఫరా నష్టాలను 10 శాతం లోపే పరిమితం చేయాలని, ఈ నష్టాలను తగ్గించిన రాష్ట్రాలకు కేంద్ర ప్రోత్సాహకాలు అందిస్తామని తెలిపింది.








