Tuesday, June 30, 2026
Chat on WhatsApp
HomeNationalAyodhya News | శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట వార్షికోత్సవానికి ప్రత్యేక కానుక

Ayodhya News | శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట వార్షికోత్సవానికి ప్రత్యేక కానుక

-

Chat on WhatsApp

Golden Ram Dhanush: అయోధ్యలో కొలువుదీరిన బాలరాముడికి ఒడిశా భక్తులు అపూర్వమైన భక్తిని చాటుకున్నారు. బాలరాముడికి  బహుమతిని  సిద్ధం చేశారు.

ఈ సందర్బంగా  శ్రీరాముడి ప్రాణ ప్రతిష్టకు రెండేళ్లు పూర్తవుతున్న వేళా సుమారు 286 కిలోల బరువున్న మహా స్వర్ణ రామధనుస్సును(Golden Ram Dhanush) అయోధ్య రాముడికి  సమర్పించేందుకు ఏర్పాట్లు చేసారు. ఈ విశిష్టమైన కళాఖండాన్ని ఒడిశా రాష్ట్రం రూర్కెలాలో అత్యంత నైపుణ్యంతో రూపొందించారు.

ఈ స్వర్ణ ధనుస్సు తయారీలో ఒక కిలో స్వచ్ఛమైన బంగారం, రెండున్నర కిలోల వెండి, అలాగే రాగి, జింక్, ఇనుము వంటి లోహాల మిశ్రమాన్ని వినియోగించారు. దీని నిర్మాణానికి సుమారు రూ.1.10 కోట్ల వ్యయం అయినట్లు సమాచారం.

ALSO REAAAD:Legends Reunion: భారత క్రికెట్ గోల్డెన్ మెమరీస్.. లెజెండ్స్ రీయూనియన్ ఫోటో వైరల్

సుమారు 8 అడుగుల పొడవు, 3 అడుగుల వెడల్పుతో రూపొందిన ఈ ధనుస్సు అత్యంత గంభీరంగా, కళాత్మకంగా దర్శనమిస్తుంది.

పూరీ జగన్నాథ స్వామి–అయోధ్య శ్రీరాముడి మధ్య ఆధ్యాత్మిక అనుబంధాన్ని ప్రతిబింబించేలా, ఈ ధనుస్సుపై జగన్నాథ స్వామి ప్రతిమను, ప్రత్యేక ఫిలిగ్రీ కిరీటాన్ని సున్నితమైన శిల్పకళతో చెక్కారు. సనాతన జాగరణ మంచ్ ఆధ్వర్యంలో ఈ స్వర్ణ ధనుస్సును ఒడిశాలోని పలు జిల్లాల గుండా ఊరేగింపుగా తీసుకెళ్లారు.

పూరీ క్షేత్రంలో సంప్రదాయబద్ధమైన పూజలు, పవిత్ర క్రతువులు పూర్తైన అనంతరం, ఈ స్వర్ణ ధనుస్సు శోభాయాత్రగా అయోధ్య దిశగా బయలుదేరింది.

జనవరి 22న, శ్రీరాముడి ప్రాణ ప్రతిష్టకు రెండేళ్లు పూర్తయ్యే వార్షికోత్సవ సందర్భంగా, ఈ మహా స్వర్ణ రామధనుస్సును బాలరాముడి పాదాల చెంత భక్తిశ్రద్ధలతో సమర్పించనున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

deepfake video targeting telangana minister sridhar babu and ias officer shailaja ramaiyer

Minister Sridhar Babu | మంత్రి శ్రీధర్ బాబు దంపతులపై డీప్‌ఫేక్ వీడియో కలకలం.....

తెలంగాణలో డీప్‌ఫేక్ టెక్నాలజీ దుర్వినియోగానికి సంబంధించిన మరో ఘటన వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Sridhar Babu), ఆయన సతీమణి, సీనియర్ ఐఏఎస్ అధికారిణి...
- Advertisement -
Chat on WhatsApp