Telangana Municipal Elections: తెలంగాణలోని మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారికంగా ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 7 నగరపాలక సంస్థలు, 116 పురపాలక సంఘాలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. షెడ్యూల్ విడుదల సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో సమావేశం నిర్వహించారు.
అనంతరం ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించారు. షెడ్యూల్ వెలువడిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు.
ఈ నెల 28వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుండగా, 30వ తేదీతో నామినేషన్ ప్రక్రియ ముగియనుంది. మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 53 లక్షల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఫిబ్రవరి 11న పోలింగ్ నిర్వహించనుండగా, ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.
ఏదైనా ప్రాంతంలో రీపోలింగ్ అవసరం ఏర్పడితే, ఫిబ్రవరి 12న నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నామని అధికారులు తెలిపారు.
ALSO READ:Amaravathi Farmers | అమరావతి రైతులకు శుభవార్త….లాటరీ ద్వారా ప్లాట్ల కేటాయింపు








