ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా(Meta Layoffs) మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగాల కోతకు సిద్ధమవుతోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ నెల 20న సుమారు 8 వేల మందికి పైగా ఉద్యోగులను విధుల నుంచి తొలగించనున్నట్లు తెలుస్తోంది. ఇది ప్రపంచవ్యాప్తంగా సంస్థ మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 10 శాతానికి సమానం.
ఉద్యోగాల కోతతో పాటు మరో 7 వేల మంది సిబ్బందిని కొత్త విభాగాల్లోకి మార్చే అవకాశముంది. ముఖ్యంగా కృత్రిమ మేధ (AI) ఆధారిత విభాగాలను బలోపేతం చేయడమే ఈ మార్పుల ప్రధాన లక్ష్యంగా చెబుతున్నారు. ప్రస్తుతం మెటాలో 78 వేల మందికి తక్కువగా ఉద్యోగులు పనిచేస్తున్నారు.
సంస్థ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉద్యోగులకు అంతర్గతంగా సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నెల 20న మూడు విడతల్లో ఉద్యోగులకు సమాచారం అందించనున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ప్రభావిత ఉద్యోగులు మొత్తం సిబ్బందిలో దాదాపు 20 శాతం వరకు ఉండొచ్చని అంచనా.
ఇదిలా ఉండగా, బ్రిటన్‌కు చెందిన స్టాండర్డ్ చార్టెర్డ్ బ్యాంక్ కూడా భారీ ఉద్యోగాల కోతకు సిద్ధమవుతోంది. 2030 నాటికి సుమారు 7,800 ఉద్యోగాలను తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 15 శాతం. ఆసియా మార్కెట్‌పై ఎక్కువగా ఆధారపడిన ఈ బ్యాంక్, AI ఆధారిత ఆటోమేషన్ ద్వారా కార్యకలాపాలను మెరుగుపరచాలని యోచిస్తోంది.








