Thursday, July 16, 2026
Chat on WhatsApp
HomeBusinessGold Price Today | పరుగులు పెడుతున్న పసిడి.. రెండు రోజుల్లో రూ.6,220 పెరిగిన పసిడి...

Gold Price Today | పరుగులు పెడుతున్న పసిడి.. రెండు రోజుల్లో రూ.6,220 పెరిగిన పసిడి ధర

-

Chat on WhatsApp

Gold Price Today: కొన్ని రోజుల పాటు స్వల్పంగా తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు మళ్లీ ఒక్కసారిగా ఊపందుకున్నాయి. వరుసగా రెండో రోజు కూడా పసిడి ధరలు భారీగా పెరగడంతో దేశీయ బులియన్ మార్కెట్‌లో కొత్త రికార్డులు నమోదయ్యాయి. ముఖ్యంగా హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఎన్నడూ లేనంత స్థాయికి చేరుకోవడంతో కొనుగోలుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అంతర్జాతీయ మార్కెట్లలో విలువైన లోహాల ధరలు పెరగడం, ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గు చూపడం వంటి కారణాలతో దేశీయ మార్కెట్‌లో కూడా బంగారం ధరలు భారీగా ఎగబాకాయి. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఒక్కరోజులోనే రూ.3,220 పెరిగి రూ.1,47,000కు చేరుకుంది. గత రెండు రోజుల్లో కలిపి చూస్తే తులం బంగారం ధరపై రూ.6,220 వరకు పెరుగుదల నమోదైంది.

ఆభరణాల తయారీలో విస్తృతంగా ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం కూడా ఇదే బాటలో సాగింది. 10 గ్రాముల ధర రూ.2,950 పెరిగి రూ.1,34,750కు చేరుకుంది. పండుగలు, శుభకార్యాల సీజన్ సమీపిస్తున్న వేళ ఈ పెరుగుదల వినియోగదారులపై అదనపు భారం మోపుతోంది.

బంగారంతో పాటు వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. పరిశ్రమల నుంచి డిమాండ్ పెరగడం, అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో కిలో వెండి ధర ఒక్కరోజులోనే రూ.10,000 పెరిగి రూ.2,60,000కు చేరుకుంది. అయితే నగల దుకాణాల మేకింగ్ ఛార్జీలు, స్థానిక పన్నులు, ప్రాంతాల వారీగా ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉందని బులియన్ వ్యాపారులు సూచిస్తున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

mega star chiranjeevi

Chiranjeevi: ముద్రగడ పద్మనాభంది రాజీపడని వ్యక్తిత్వం.. చిరంజీవి భావోద్వేగ వ్యాఖ్యలు 

కాపు ఉద్యమానికి చిరునామాగా నిలిచిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (73) మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన...
- Advertisement -
Chat on WhatsApp