పైరసీ వెబ్‌సైట్ iBomma నిర్వాహకుడు రవికుమార్‌ను కొంతమంది రాబిన్ హుడ్‌గా వ్యాక్యనించి మద్దతు ఇవ్వడం మంచిదేనా.దీనిపై పెద్ద చేర్చ కొనసాగుతుంది.టిక్కెట్ రేట్లు ఎక్కువగా ఉండటంతో పైరసీ ద్వారా సినిమాలు చూడడం తప్పేమీ కాదని అంటున్నారు నెటిజన్లు.
అయితే ఇది దోపిడీకి సమర్థన ఇస్తున్నట్లేనని ఫిల్మ్ ఇండస్ట్రీ అభిప్రాయపడుతోంది. సినిమా టిక్కెట్ ఖరీదైనదని చెప్పి పైరసీకి న్యాయం చెయ్యడం, ఇతరులకు నష్టం కలిగించే చర్యలకు మద్దతు ఇచ్చినట్లే అని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సినిమా నిర్మాణంలో నిర్మాతతో పాటు వందల మంది కష్టపడతారు. అలాంటి కష్టాన్ని రిలీజ్‌కి ముందే లీక్ చేస్తే, ఆ శ్రమ అంతా వృథా అవుతుంది. నిర్మాత నష్టపోతే కార్మికుల ఉపాధి కూడా ప్రమాదంలో పడుతుంది. రవికుమార్ ఇది దోపిడీ కాదని వాదించినా, దొంగతనాన్ని న్యాయపరచడం కుదరదని నిపుణులు చెబుతున్నారు.
టిక్కెట్ రేట్లు ఎక్కువగా ఉన్నాయని చెప్పి దొంగతనానికి సమర్థన ఇవ్వడం ప్రమాదకర మార్గమని, ఇదే విధంగా ఇతరుల సంపాదనను దోచుకునే ప్రవర్తన పెరుగుతుందని పరిశ్రమ హెచ్చరిస్తోంది.
ALSO READ:నక్సలిజానికి క్లైమాక్స్? మావోయిస్టు ప్రభావం పూర్తిగా తగ్గిపోతుందా
