TTD ఆధ్వర్యంలోని BIRRD Trust Hospital (బాలాజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సర్జరీ రీసెర్చ్ అండ్ రిహాబిలిటేషన్ ఫర్ ది డిసేబుల్డ్) ఫ్యాకల్టీ మరియు వైద్య పోస్టుల భర్తీకి దరఖాస్తులు ప్రకటించింది. అర్హులైన అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ 16 మార్చి 2026 సాయంత్రం 5 గంటలు.
భర్తీ చేయనున్న పోస్టులు: ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, వైద్య అధికారి, జూనియర్ రెసిడెంట్, సీనియర్ రెసిడెంట్. అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఎంబీబీఎస్, ఎండీ/ఎంఎస్/డీఎన్‌బీ లేదా సంబంధిత విభాగంలో పీజీ డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.
జీతభత్యాలు పోస్టును బట్టి ఆకర్షణీయంగా ఉన్నాయి. ప్రొఫెసర్‌కు రూ.2,92,423, అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.2,73,257, అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు రూ.2,09,297, వైద్య అధికారికి రూ.93,525, జూనియర్ రెసిడెంట్‌కు రూ.74,750, సీనియర్ రెసిడెంట్‌కు రూ.80,500 అందిస్తారు. దరఖాస్తు రుసుము లేదు. ఎంపిక ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది.
అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు పత్రాన్ని డౌన్‌లోడ్ చేసి, అవసరమైన పత్రాలతో కలిసి డైరెక్టర్, BIRRD ట్రస్ట్ హాస్పిటల్, TTD, తిరుపతి–517501 చిరునామాకు పంపాలి.
ఈ నియామకాలు రెండు సంవత్సరాల కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉంటాయి. గడువు ముగిసిన తర్వాత ఒప్పందం స్వయంచాలకంగా రద్దవుతుంది.








