KL Rahul: ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ కేఎల్ రాహుల్ అద్భుతమైన సెంచరీతో దుమ్మురేపారు. అరుణ్ జైట్లీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాహుల్ కేవలం 47 బంతుల్లోనే శతకాన్ని పూర్తి చేసి జట్టుకు భారీ ఆరంభం అందించారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు రాహుల్ తన దూకుడైన ఆటతో అద్భుత ప్రారంభాన్ని ఇచ్చారు. మొదటి ఓవర్ నుంచే దూకుడుగా ఆడిన ఆయన పంజాబ్ బౌలర్లపై ఆధిపత్యం చూపించారు. సెంచరీకి తన ఇన్నింగ్స్‌లో 6 సిక్సర్లు, 12 ఫోర్లు బాది స్టేడియంలో ప్రేక్షకులను అలరించారు. కవర్ డ్రైవ్‌లు, పుల్ షాట్లతో పంజాబ్ బౌలింగ్‌ను పూర్తిగా కష్టాల్లోకి నెట్టేశారు.
20 ఓవర్లు ముగిసే సరికి కేఎల్ రాహుల్ 67 బంతుల్లో 152 పరుగులతో 16 ఫోర్లు 9 సిక్సులతో నాట్ అవుట్ గా నిలిచాడు కొనసాగుతున్నారు.








