Thursday, July 16, 2026
Chat on WhatsApp
HomeInterNationalSheikh Hasina |  "శిక్ష ఎదురైనా స్వదేశానికి తిరిగి వెళ్తాను".. షేక్ హసీనా

Sheikh Hasina |  “శిక్ష ఎదురైనా స్వదేశానికి తిరిగి వెళ్తాను”.. షేక్ హసీనా

-

Chat on WhatsApp

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) స్వదేశానికి తిరిగి వెళ్లాలన్న నిర్ణయం రాజకీయంగా చర్చనీయాంశమైంది. 2024లో విద్యార్థుల నిరసనల నేపథ్యంలో పదవీచ్యుతురాలైన హసీనా అప్పటి నుంచి భారత్‌లో నివసిస్తున్నారు. విద్యార్థులపై కాల్పులకు ఆదేశించడం, మానవత్వానికి వ్యతిరేక నేరాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై బంగ్లాదేశ్‌లోని అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ ఆమెకు శిక్ష విధించినట్లు అక్కడి అధికారులు ప్రకటించారు.

ఇదే సమయంలో ఆమెను తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం భారత్‌ను కోరుతోంది. అయితే తాజాగా “శిక్ష ఎదురైనా స్వదేశానికి తిరిగి వెళ్తాను” అని హసీనా ప్రకటించారు. ఆమె నిర్ణయాన్ని బంగ్లాదేశ్ ప్రభుత్వం స్వాగతించింది. ప్రధాని తారిఖ్ రెహ్మాన్ సలహాదారు జాహెదుర్ రెహ్మన్ మాట్లాడుతూ, హసీనా ప్రపంచంలోని అత్యుత్తమ న్యాయవాదులను తీసుకొచ్చి కోర్టులో తన వాదనలు వినిపించవచ్చని అన్నారు. ఢాకాలోని అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్‌లో విచారణ పారదర్శకంగా జరుగుతుందని, అవసరమైతే పరిశీలకుల సమక్షంలో, వీడియో ప్రసారంతో కూడా నిర్వహించవచ్చని తెలిపారు. కోర్టు తుది నిర్ణయం ప్రకారం ఆమెపై విధించిన శిక్ష కొనసాగవచ్చని లేదా తీర్పులో మార్పులు రావచ్చని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

India cricket team players preparing for the second ODI against England in Cardiff

India vs England | భారత్-ఇంగ్లాండ్ రెండో వన్డే.. గెలిస్తే సిరీస్,లేదంటే ?

India vs England: కార్డిఫ్(Cardiff) వేదికగా జరగనున్న భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో వన్డేలో తలపడేందుకు  రంగం సిద్ధమైంది. తొలి వన్డే మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం కాగా, రెండో వన్డే సమయాల్లో మార్పు చేశారు....
- Advertisement -
Chat on WhatsApp