ఆంధ్రప్రదేశ్ కోనసీమ జిల్లా రావులపాలెంలో హిడ్మా అనుచరుడు మాధవిహండా(Madhavihanda) అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు.మావోయిస్టు అగ్రనేత హిడ్మా(Hidma)కు అత్యంత సమీప అనుచరుడిగా మాధవిహండాను భావిస్తున్నరు పోలీసులు.
రావులపాలెం ప్రాంతంలో అతడు సంచరిస్తున్నట్లు వచ్చిన సమాచారాన్ని ఆధారంగా తీసుకున్న పోలీసులు ప్రత్యేక బృందంతో సోదాలు నిర్వహించి అరెస్ట్ చేశారు. మాధవిహండా అసలు పేరు సరోజ్ కాగా, అతడు ఛత్తీస్గడ్‌కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.
ALSO READ:BEd BPEd Admission Issue: ఇన్-సర్వీస్ టీచర్ల ఉన్నత విద్య దరఖాస్తులకు షాక్
హిడ్మా గ్రూప్‌కు కీలక సమాచారం అందించే వ్యక్తిగా అనుమానిస్తున్న నేపథ్యంలో అతడి రావులపాలెం ప్రవాసంపై అధికారులు లోతుగా విచారణ చేస్తున్నారు. మావోయిస్టుల కదలికలు, ప్రాంతీయ నెట్‌వర్కులు, APలో వారి సంచరణలపై వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం.
అరెస్ట్ చేసిన వ్యక్తిని మరింత విచారణ కోసం ప్రత్యేక దళాలు హాజరుపరచగా, మావోయిస్టు చట్టవిరుద్ధ కార్యకలాపాలపై కీలక సమాచారాన్ని వెలికి తీయనున్నట్లు అధికారులు తెలిపారు.
