HomeSportsT20 World Cup 2026 semi-final | ఫైనల్‌కు అడుగు దూరంలో టీమిండియా.. ఇంగ్లాండ్‌తో నిర్ణయాత్మక...

T20 World Cup 2026 semi-final | ఫైనల్‌కు అడుగు దూరంలో టీమిండియా.. ఇంగ్లాండ్‌తో నిర్ణయాత్మక పోరు

-

Chat on WhatsApp

T20 World Cup 2026 semi-final: టీ20 ప్రపంచకప్‌ 2026లో కీలక ఘట్టమైన రెండో సెమీఫైనల్‌కు రంగం సిద్ధమైంది. ఈ రోజు జరిగే ఉత్కంఠభరిత పోరులో భారత్ మరియుఇంగ్లాండ్ జట్లు తలపడనున్నాయి. ముంబైలోని వానఖేడే ఈ మ్యాచ్‌కు వేదికగా నిలవనుంది. ఈ పోరులో విజయం సాధించిన జట్టు ఫైనల్‌లో ఇప్పటికే అర్హత సాధించిన న్యూజిలాండ్ తో టైటిల్ పోరుకు సిద్ధమవుతుంది.

ఈ మ్యాచ్‌కు మరో ప్రత్యేకత కూడా ఉంది. వరుసగా మూడోసారి టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్‌లో భారత్, ఇంగ్లాండ్ జట్లు ఒకదానికొకటి ఎదురుపడుతున్నాయి.

2022లో జరిగిన సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్ భారత్‌ను ఓడించి ఫైనల్‌కు చేరగా, 2024లో గయానాలో జరిగిన సెమీఫైనల్‌లో భారత్ ప్రతీకారం తీర్చుకుని ఫైనల్ చేరి కప్‌ను గెలుచుకుంది. ఇప్పుడు 2026లో మరోసారి ఈ రెండు జట్లు తలపడుతుండడంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.

సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో భారత జట్టు బరిలోకి దిగుతుండగా, హ్యారీ బ్రూక్ సారథ్యంలో ఇంగ్లాండ్ జట్టు పోరుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో వాతావరణ పరిస్థితులు కూడా కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.

ఒకవేళ వర్షం కారణంగా ఆటకు అంతరాయం కలిగితే రిజర్వ్ డేను ఏర్పాటు చేశారు. గురువారం అదనంగా 90 నిమిషాలు, శుక్రవారం 120 నిమిషాల అదనపు సమయం కేటాయించారు. కనీసం ఐదు ఓవర్ల మ్యాచ్ జరగేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.

ఒకవేళ మ్యాచ్ పూర్తిగా రద్దయితే సూపర్-8 దశ పాయింట్ల పట్టిక ఆధారంగా ఫలితాన్ని నిర్ణయిస్తారు. ఆ పరిస్థితిలో గ్రూప్-2లో అగ్రస్థానంలో నిలిచిన ఇంగ్లాండ్ ఫైనల్‌కు చేరుతుంది. భారత్ గ్రూప్-1లో రెండో స్థానంలో నిలిచింది కాబట్టి టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి ఉంటుంది.

అయితే ముంబైలో వర్షం వచ్చే అవకాశాలు తక్కువగా ఉండటంతో పూర్తి మ్యాచ్ జరిగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

వానఖేడే స్టేడియం పిచ్ సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. ఈ టోర్నీలో ఇక్కడ జరిగిన మ్యాచ్‌ల్లో జట్లు భారీ స్కోర్లు నమోదు చేశాయి.

దీంతో ఈ సెమీఫైనల్‌లో కూడా హైస్కోరింగ్ థ్రిల్లర్ చూడొచ్చని అభిమానులు ఆశిస్తున్నారు. మొత్తంగా ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను ఎవరు ఎదుర్కొంటారో నేడు తేలనుంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Lionel Messi | మెస్సీ ఇంట తీవ్ర విషాదం.. తండ్రి జార్జ్ మెస్సీ కన్నుమూత

Lionel Messi: ఫుట్‌బాల్ ప్రపంచాన్ని విషాదంలో ముంచెత్తే వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనెల్ మెస్సీ తండ్రి, ఆయన కెరీర్‌కు బలమైన అండగా నిలిచిన జార్జ్ మెస్సీ (68)...
- Advertisement -
Chat on WhatsApp