Thursday, July 23, 2026
Chat on WhatsApp
HomeENTERTAINMENTRanveer Singh | సునామీ సృష్టించిన ధురంధర్ 2...రూ.3000 కోట్ల క్లబ్‌లో..?

Ranveer Singh | సునామీ సృష్టించిన ధురంధర్ 2…రూ.3000 కోట్ల క్లబ్‌లో..?

-

Chat on WhatsApp

Ranveer Singh: బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ హీరోగా, దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ‘ధురంధర్’(Dhurandhar) ఫ్రాంచైజీ భారతీయ సినీ పరిశ్రమలో సరికొత్త చరిత్రను సృష్టించింది.

కేవలం రెండు భాగాలతోనే ఈ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా రూ.3,000 కోట్ల వసూళ్లను దాటి, ఈ ఘనత సాధించిన తొలి భారతీయ ఫిల్మ్ ఫ్రాంచైజీగా నిలిచింది.

జియో స్టూడియోస్, B62 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది.

2025 డిసెంబర్ 5న విడుదలైన ‘ధురంధర్’ తొలి భాగం అంచనాలను మించి వసూళ్లు రాబట్టింది. హిందీ బాక్సాఫీస్ వద్ద సుమారు రూ.840 కోట్లకు పైగా నెట్ కలెక్షన్లు సాధించగా, ప్రపంచవ్యాప్తంగా రూ.1,300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు నమోదు చేసింది.

దీంతో ఈ చిత్రం భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచి ఫ్రాంచైజీకి బలమైన పునాది వేసింది.

తొలి భాగం విజయాన్ని కొనసాగిస్తూ కేవలం నాలుగు నెలల వ్యవధిలో వచ్చిన ‘ధురంధర్ 2: ది రివెంజ్’ మరింత సంచలనం సృష్టించింది.

ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1,700 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ముఖ్యంగా ఒకే భాషలో రూ.1,000 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించిన తొలి భారతీయ చిత్రంగా రికార్డు సృష్టించింది.

ఈ రెండు చిత్రాల కలిపిన వసూళ్లు రూ.3,000 కోట్ల మైలురాయిని దాటడంతో ‘ధురంధర్’ ఫ్రాంచైజీ చరిత్రలో నిలిచిపోయింది.

రణవీర్ సింగ్‌తో పాటు సంజయ్ దత్, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్ వంటి ప్రముఖులు నటించిన ఈ సినిమాలు దేశభక్తి, హై-వోల్టేజ్ యాక్షన్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. గ్లోబల్ స్థాయిలో భారతీయ సినిమాకు ఈ ఫ్రాంచైజీ కొత్త గుర్తింపును తీసుకువచ్చింది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Geetanjali Wangchuk speaking about the NEET protest in New Delhi

Geetanjali | ‘చిత్తశుద్ధి ఉంటే మొదటి నుంచే వచ్చేవారు’.. కాంగ్రెస్‌కు గీతాంజలి స్ట్రాంగ్ మెసేజ్

Geetanjali: నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై కాంగ్రెస్ చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ భార్య గీతాంజలి తీవ్రంగా విమర్శించారు. విద్యార్థులు జంతర్‌మంతర్ వద్ద మొదటి నుంచి ఆందోళన చేస్తున్న...
- Advertisement -
Chat on WhatsApp