Wednesday, July 22, 2026
Chat on WhatsApp
HomeNationalJag Vikram | ఎల్పీజీ సరఫరాలో కీలక పరిణామం.. కాండ్లాకు చేరిన ‘జగ్ విక్రం’ నౌక

Jag Vikram | ఎల్పీజీ సరఫరాలో కీలక పరిణామం.. కాండ్లాకు చేరిన ‘జగ్ విక్రం’ నౌక

-

Chat on WhatsApp

భారత జెండా కలిగిన ఎల్పీజీ నౌక ‘జగ్ విక్రం’(Jag Vikram) విజయవంతంగా హోర్ముజ్ జలసంధి దాటి ఏప్రిల్ 14న కాండ్లా పోర్టుకు చేరుకుంది. ఏప్రిల్ 11న ప్రయాణం ప్రారంభించిన ఈ నౌకలో మొత్తం 20,400 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ సరుకు ఉంది.

మంగళవారం రాత్రి ఆలస్యంగా కాండ్లా పోర్టులోని ఆయిల్ జెట్టి నెంబర్-1 వద్ద నౌక నిలిచింది. త్వరలోనే సరుకు దిగుమతి ప్రక్రియ ప్రారంభం కానుంది. దీంతో దేశంలో ఎల్పీజీ సరఫరా మరింత బలోపేతం అవుతుందని అధికారులు భావిస్తున్నారు.

అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ అనంతరం హోర్ముజ్ మార్గం గుండా ప్రయాణించిన తొలి భారత నౌకగా ‘జగ్ విక్రం’ నిలవడం విశేషం. ఇది భారతానికి వ్యూహాత్మకంగా కీలక పరిణామంగా భావిస్తున్నారు.

గల్ఫ్ ప్రాంతంలో సముద్ర మార్గాల భద్రతపై నిఘా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నౌక సురక్షితంగా చేరుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇదిలా ఉండగా, హోర్ముజ్ జలసంధిలో నిలిచిపోయిన 15 భారత నౌకలను తిరిగి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ మరియు విదేశాంగ మంత్రిత్వ శాఖ సమన్వయంతో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. పరిస్థితులు అనుకూలించగానే ఆ నౌకలను తిరిగి తీసుకురానున్నట్లు అధికారులు తెలిపారు.


గల్ఫ్ దేశాల నుంచి భారత్‌కు వచ్చే ఎల్పీజీ దిగుమతుల్లో దాదాపు 90 శాతం వాటా ఉండటం వల్ల ఈ మార్గం అత్యంత కీలకం. ప్రస్తుతం భారత నౌకలు, సిబ్బంది సురక్షితంగా ఉన్నారని, గత 24 గంటల్లో ఎలాంటి ఘటనలు చోటుచేసుకోలేదని అధికారులు స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో ‘జగ్ విక్రం’ రాక దేశ ఇంధన భద్రతకు ఊతమిచ్చే పరిణామంగా భావిస్తున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Minister Nara Lokesh distributing house pattas to beneficiaries in Mangalagiri

Mana Illu- Mana Lokesh | మంగళగిరిని రాష్ట్రానికే రోల్ మోడల్ చేస్తాం: నారాలోకేష్  లోకేశ్

మంగళగిరి నియోజకవర్గాన్ని రాష్ట్రానికే ఆదర్శంగా నిలిపేలా అభివృద్ధి చేస్తానని ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. 'మన ఇల్లు-మన లోకేశ్'(Mana Illu- Mana Lokesh) కార్యక్రమంలో భాగంగా మంగళగిరి, తాడేపల్లి మండలాలకు...
- Advertisement -
Chat on WhatsApp