Thursday, July 23, 2026
Chat on WhatsApp
HomeNationalGeetanjali | 'చిత్తశుద్ధి ఉంటే మొదటి నుంచే వచ్చేవారు'.. కాంగ్రెస్‌కు గీతాంజలి స్ట్రాంగ్ మెసేజ్

Geetanjali | ‘చిత్తశుద్ధి ఉంటే మొదటి నుంచే వచ్చేవారు’.. కాంగ్రెస్‌కు గీతాంజలి స్ట్రాంగ్ మెసేజ్

-

Chat on WhatsApp

Geetanjali: నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై కాంగ్రెస్ చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ భార్య గీతాంజలి తీవ్రంగా విమర్శించారు. విద్యార్థులు జంతర్‌మంతర్ వద్ద మొదటి నుంచి ఆందోళన చేస్తున్న సమయంలో కాంగ్రెస్ ముందుకు రాలేదని, ఇప్పుడు నిరసనలు చేపట్టడం చిత్తశుద్ధిని ప్రశ్నించేలా ఉందన్నారు. ఈ ఉద్యమం పూర్తిగా విద్యార్థుల భవిష్యత్తు, పరీక్షల పారదర్శకత కోసం ప్రారంభమైందని, దీనికి రాజకీయ రంగు పులమకూడదని స్పష్టం చేశారు.

సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన ఆమరణ దీక్షను పోలీసులు అడ్డుకుని ఆస్పత్రికి తరలించిన తర్వాత కూడా ఆయన అక్కడి నుంచే నిరసన కొనసాగిస్తున్నారని తెలిపారు. ఈ ఉద్యమాన్ని తమ రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించుకోవాలని కొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించిన గీతాంజలి, అలాంటి ప్రయత్నాలను యువత గుర్తిస్తుందని అన్నారు. తమకు అధికార, ప్రతిపక్ష పార్టీలతో సంబంధం లేదని, ఈ అంశంపై పార్లమెంటే స్పందించి పరిష్కారం చూపాలని కోరారు. నిజాయతీ, స్వచ్ఛత ఆధారంగా ఈ ఉద్యమం సాగుతోందని పేర్కొన్న ఆమె, ఎలాంటి రాజకీయ ఎజెండా లేని వారు మాత్రమే తమకు మద్దతుగా నిలవాలని చెప్పారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

KTR

KTR | వేడుకల కంటే విద్యార్థుల పోరాటమే ముఖ్యం: కేటీఆర్ 

KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన జూలై 24 పుట్టినరోజును వేడుకగా జరుపుకోకుండా ప్రజా సమస్యలపై పోరాటానికి అంకితం చేయాలని నిర్ణయించారు. ఢిల్లీలో నీట్ పరీక్ష అక్రమాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న...
- Advertisement -
Chat on WhatsApp