Dell launches XPS 13: ప్రపంచ ప్రఖ్యాత కంప్యూటర్ తయారీ సంస్థ డెల్ తన తాజా ప్రీమియం ల్యాప్‌టాప్ Dell XPS 13 (2026) ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఆధునిక డిజైన్, శక్తివంతమైన పనితీరు, తేలికైన బాడీతో ఈ ల్యాప్‌టాప్ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఈ కొత్త మోడల్‌లో ఇంటెల్ తాజా పాంథర్ లేక్(Panther Lake) ప్రాసెసర్‌తో పాటు 32GB వరకు RAM, 2.5K టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే వంటి అధునాతన ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.
ధర విషయానికి వస్తే Dell XPS 13 (2026) ప్రారంభ ధర 699 డాలర్లు (సుమారు రూ.66,000)గా నిర్ణయించారు. విద్యార్థులకు ప్రత్యేక ఆఫర్ కింద 599 డాలర్లు (సుమారు రూ.57,000) ధరకు అందించనున్నారు. డిస్‌ప్లే పరంగా ఈ ల్యాప్‌టాప్‌లో 13.4 అంగుళాల 2.5K InfinityEdge టచ్‌స్క్రీన్ ఉంది. ఇది 2560×1600 పిక్సెల్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 500 నిట్స్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది.
పర్ఫార్మెన్స్ కోసం Intel Core Ultra 7 Series 3 355 ప్రాసెసర్‌తో పాటు Core 5 Series 3 322 వేరియంట్ కూడా అందుబాటులో ఉంది. ఇందులో ఇంటిగ్రేటెడ్ Intel GPUను ఉపయోగించారు. RAM పరంగా 32GB వరకు LPDDR5X, స్టోరేజ్‌లో 1TB వరకు PCIe Gen 4 SSD అందుబాటులో ఉంది. దీంతో మల్టీటాస్కింగ్, వీడియో ఎడిటింగ్ వంటి పనులు సులభంగా చేయవచ్చు.
కెమెరా విభాగంలో 2MP IR వెబ్‌క్యామ్‌ను అందించారు. ఇది Windows Hello ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌కు సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ విషయానికి వస్తే 52Wh బ్యాటరీతో పాటు 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. కనెక్టివిటీ పరంగా Wi-Fi 7, Bluetooth 6, USB Type-C పోర్టులు, Thunderbolt 4 సపోర్ట్ అందించారు.
డిజైన్ విషయానికి వస్తే ఈ ల్యాప్‌టాప్ బరువు కేవలం 1 కిలోగ్రామ్ మాత్రమే. దీంతో ఇది అల్ట్రా-పోర్టబుల్ ల్యాప్‌టాప్‌గా నిలుస్తోంది. మొత్తం మీద Dell XPS 13 (2026) ప్రీమియం డిజైన్, శక్తివంతమైన హార్డ్‌వేర్‌తో విద్యార్థులు, ప్రొఫెషనల్స్‌కు మంచి ఎంపికగా మారనుంది.








