Sunday, July 12, 2026
Chat on WhatsApp
HomeInterNationalEbola Virus Vaccine | ఎబోలా వైరస్‌కు కొత్త వ్యాక్సిన్ అభివృద్ధి... రష్యా మంత్రి కీలక...

Ebola Virus Vaccine | ఎబోలా వైరస్‌కు కొత్త వ్యాక్సిన్ అభివృద్ధి… రష్యా మంత్రి కీలక ప్రకటన

-

Chat on WhatsApp

Ebola Virus Vaccine: ఎబోలా వైరస్‌ గురుంచి ఆందోళన చెందుతున్న వేళా రష్యా కీలక ప్రకటన చేసింది. ఈ వైరస్‌లో కొత్తగా గుర్తించిన “బుండిబుగ్యో” రకం వేగంగా వ్యాపిస్తుండటంతో, ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization) దీనిని అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో వైరస్ నియంత్రణకు కొత్త వ్యాక్సిన్ అభివృద్ధి చేసినట్లు రష్యా ఆరోగ్యశాఖ మంత్రిమిఖాయిల్ మురాష్కో(Mikhail Murashko) తెలిపారు.

ఈ వైరస్ ప్రధానంగా ఆఫ్రికా దేశాలైన కాంగో, ఉగాండా ప్రాంతాల్లో కనిపిస్తోంది. ఎబోలా వైరస్ సాధారణంగా గబ్బిలాల నుంచి ప్రారంభమవుతుంది. గబ్బిలాలు తిన్న పండ్లు లేదా వాటి విసర్జితాలను అడవి జంతువులు తినడం ద్వారా వైరస్ వాటిలోకి చేరుతుంది. ఆ జంతువుల మాంసాన్ని మనుషులు సరిగా ఉడికించకుండా తింటే వైరస్ మనుషులకు సంక్రమిస్తుంది.

ఎబోలా ఒక వ్యక్తి నుంచి మరొకరికి నేరుగా శరీర ద్రవాల ద్వారా మాత్రమే వ్యాపిస్తుంది. అంటే రక్తం, చెమట, లాలాజలం, వాంతులు, మూత్రం వంటి ద్రవాలు తాకినప్పుడు లేదా గాయాల ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇది COVID-19 లాగా గాలి ద్వారా వ్యాపించదు. వైరస్ శరీరంలోకి వెళ్లిన తర్వాత వెంటనే లక్షణాలు కనిపించవు.

ఈ దశను ఇన్క్యుబేషన్ పీరియడ్ అంటారు (2–21 రోజులు). తర్వాత జ్వరం, నీరసం, కండరాల నొప్పులు మొదలవుతాయి. తర్వాత దశలో వాంతులు, విరేచనాలు, చర్మ దద్దుర్లు కనిపిస్తాయి.

తీవ్రమైన దశలో అంతర్గత రక్తస్రావం జరిగి అవయవాలు డ్యామేజ్ అవుతాయి. రక్షణ కోసం అడవి జంతువుల మాంసం తినకూడదు, శుభ్రత పాటించాలి, చేతులు తరచుగా కడగాలి. సరైన జాగ్రత్తలు తీసుకుంటే వ్యాప్తిని నియంత్రించవచ్చు.

సింపుల్‌గా చెప్పాలంటే:

  • వైరస్ జంతువుల నుంచి వస్తుంది
  • రక్తం/ద్రవాల ద్వారా మాత్రమే వ్యాపిస్తుంది
  • గాలి ద్వారా కాదు
  • లక్షణాలు ఆలస్యంగా వస్తాయి
  • కానీ తీవ్రంగా మారితే ప్రమాదకరం

ALSO READ:BJP | బీజేపీలో భారీ మార్పులు.. నాలుగు రాష్ట్రాలకు కొత్త రాష్ట్రాధ్యక్షులు


- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

ins-mahendragiri-inducted-into-indian-navy-rajnath-singh

Rajnath Singh | సముద్రంలో భారత్‌కు తిరుగులేదు.. రాజ్‌నాథ్ సింగ్ కీలక ప్రకటన

Rajnath Singh: భారత సముద్ర భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక అడుగు పడింది. విశాఖపట్నంలోని నావల్ డాక్‌యార్డ్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి భారత నౌకాదళంలో కొత్తగా...
- Advertisement -
Chat on WhatsApp