Thursday, July 16, 2026
Chat on WhatsApp
HomeNationalBJP | బీజేపీలో భారీ మార్పులు.. నాలుగు రాష్ట్రాలకు కొత్త రాష్ట్రాధ్యక్షులు

BJP | బీజేపీలో భారీ మార్పులు.. నాలుగు రాష్ట్రాలకు కొత్త రాష్ట్రాధ్యక్షులు

-

Chat on WhatsApp

బీజేపీ(BJP) హైకమాండ్ నాలుగు రాష్ట్రాల్లో రాష్ట్ర అధ్యక్షుల నియామకాన్ని అధికారికంగా వెల్లడించింది. గురువారం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో పంజాబ్, హర్యానా, ఢిల్లీ, త్రిపుర రాష్ట్ర బీజేపీ విభాగాలకు కొత్త నాయకత్వాన్ని నియమించింది. ఈ నిర్ణయం ద్వారా పార్టీని మరింత బలోపేతం చేయడం, రాబోయే ఎన్నికలకు సమర్థవంతమైన వ్యూహంతో ముందుకు సాగడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి హర్ష మల్హోత్రా (Harsh Malhotra)ను నియమించింది. పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా వ్యవహరిస్తున్న ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించడం విశేషంగా మారింది.

పంజాబ్ రాష్ట్ర అధ్యక్షుడిగా సీనియర్ నేత కేవల్ సింగ్ ధిల్లాన్(Kewal Singh Dhillon) పేరును ప్రకటించింది. అలాగే హర్యానా బీజేపీ అధ్యక్షురాలిగా అర్చన గుప్తను నియమించగా, త్రిపుర బీజేపీ అధ్యక్ష బాధ్యతలను అభిషేక్ దేబ్రాయ్ కు అప్పగించింది.

ఈ నియామకాలతో ఆయా రాష్ట్రాల్లో పార్టీ సంస్థాగత బలం మరింత పెరుగుతుందని బీజేపీ నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. కొత్త అధ్యక్షుల నాయకత్వంలో పార్టీ కార్యకలాపాలు వేగవంతం అవుతాయని భావిస్తున్నారు.

ALSO READ:Crude oil prices | మళ్లీ పెరగనున్న క్రూడ్ ఆయిల్ ధరలు… కారణాలివే ?


- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

mega star chiranjeevi

Chiranjeevi: ముద్రగడ పద్మనాభంది రాజీపడని వ్యక్తిత్వం.. చిరంజీవి భావోద్వేగ వ్యాఖ్యలు 

కాపు ఉద్యమానికి చిరునామాగా నిలిచిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (73) మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన...
- Advertisement -
Chat on WhatsApp