Saturday, July 11, 2026
Chat on WhatsApp
HomeInterNationalVietnam Boat Accident | వియత్నాంలో ఘోర విషాదం.. బోటు బోల్తా, చిక్కుకున్న ఏపీ పర్యాటకులు

Vietnam Boat Accident | వియత్నాంలో ఘోర విషాదం.. బోటు బోల్తా, చిక్కుకున్న ఏపీ పర్యాటకులు

-

Chat on WhatsApp

Vietnam Boat Accident: వియత్నాంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం హాలాంగ్ బేలో జరిగిన బోటు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. సముద్ర విహారయాత్ర కోసం పర్యాటకులతో బయలుదేరిన ఓ బోటు అనుకోని పరిస్థితుల్లో నీటిలో బోల్తా పడటంతో ప్రాణనష్టం సంభవించింది. ఈ ఘటనలో పలువురు మృతి చెందినట్లు, మరికొందరు గాయపడినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం, ప్రమాద సమయంలో బోటులో 32 మంది పర్యాటకులతో పాటు ముగ్గురు సిబ్బంది ప్రయాణిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. క్షతగాత్రులను వెంటనే సమీప వైద్యశాలలకు తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ ఘటనలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొందరు పర్యాటకులు కూడా ఉన్నట్లు తెలుస్తుండటంతో వారి కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. తమ బంధువుల పరిస్థితిపై సమాచారం అందించడంతో పాటు వారిని సురక్షితంగా స్వదేశానికి తీసుకురావాలని బాధిత కుటుంబాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.

ప్రమాదం నుంచి బయటపడిన కొందరు తెలుగు రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు అధికారులను సంప్రదించి సహాయం కోరినట్లు సమాచారం. మృతుల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సెల్‌ఫోన్ వ్యాపారులు ఉన్నట్లు తెలుస్తుండగా, కడప జిల్లాకు చెందిన శ్రీధర్ అనే వ్యక్తి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలపై వియత్నాం అధికారులు విచారణ ప్రారంభించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న నేపథ్యంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

instagram ai image feature removed after privacy concerns

మెటా కీలక నిర్ణయం.. Meta AI Image ఫీచర్‌కు బ్రేక్

Meta AI Image: కృత్రిమ మేధ (AI) ఆధారిత ఫీచర్లను వేగంగా విస్తరిస్తున్న మెటా తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రవేశపెట్టిన ఒక కొత్త సౌకర్యాన్ని వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి ఎదుర్కొంది. వినియోగదారుల ఫొటోలను AI...
- Advertisement -
Chat on WhatsApp