BCCI Central Contracts: టీమ్ఇండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు బీసీసీఐ నుంచి షాకింగ్ న్యూస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సెంట్రల్ కాంట్రాక్ట్ వ్యవస్థలో కీలక మార్పులు చేయడానికి బోర్డు సిద్ధమవుతున్నట్లు సమాచారం తెలుస్తోంది.
అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ, ప్రస్తుతం అమల్లో ఉన్న ‘ఏ ప్లస్’ కేటగిరీని పూర్తిగా తొలగించాలని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.
ALSO READ:Medaram Jatara Buses | మహిళలకు స్పెషల్ బస్సుల్లోనూ ఫ్రీ ట్రావెల్
ఈ ప్రతిపాదనకు బీసీసీఐ ఆమోదం లభిస్తే, వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్న కోహ్లీ, రోహిత్‌లపై ప్రభావం పడే అవకాశం ఉంది. వీరిద్దరినీ ‘బి గ్రేడ్’ కేటగిరీలోకి మార్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు బీసీసీఐ వర్గాలు పేర్కొంటున్నాయి.
ప్రస్తుతం ‘ఏ ప్లస్’ గ్రేడ్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా ఉన్నారు. ఈ గ్రేడ్‌లో ఉన్న ఆటగాళ్లకు ఏడాదికి రూ.7 కోట్ల వరకు కాంట్రాక్ట్ మొత్తంగా చెల్లిస్తున్నారు.
ఫార్మాట్ల వారీగా ఆటగాళ్ల పాల్గొనడాన్ని పరిగణనలోకి తీసుకుని కాంట్రాక్టులను పునర్వ్యవస్థీకరించాలని సెలక్షన్ కమిటీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీమ్ఇండియా సీనియర్ ఆటగాళ్ల కాంట్రాక్ట్ స్థాయిల్లో మార్పులు జరగవచ్చని క్రీడా వర్గాల్లో చర్చ సాగుతోంది.
