LIVE
Sunday, November 15, 2026
LIVE
LIVE

India and Pakistan | మళ్లీ అదే సీన్.. భారత్-పాక్ టాస్‌లో ‘నో హ్యాండ్‌షేక్’

by Bajaswamy
10 views
India and Pakistan

Asian Games 2026: బ్యాట్‌, బాల్‌తో పోరుకు ముందు భారత్-పాక్(India and Pakistan) కెప్టెన్ల మధ్య మరోసారి దూరం కనిపించింది. ఏషియన్ గేమ్స్‌ 2026 పురుషుల క్రికెట్‌ ఫైనల్లో టాస్‌ సందర్భంగా టీమిండియా కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌, పాకిస్థాన్‌ కెప్టెన్‌ సాహిబ్‌జాదా ఫర్హాన్‌ పరస్పరం చేతులు కలుపుకోలేదు. ఇద్దరూ మాట్లాడుకున్నప్పటికీ షేక్‌హ్యాండ్‌ మాత్రం జరగలేదు. దీంతో గత కొంతకాలంగా ఈ రెండు జట్ల క్రికెట్‌ మ్యాచ్‌ల్లో కనిపిస్తున్న ‘నో హ్యాండ్‌షేక్‌’ (no handshake) సీన్‌ మరోసారి చర్చకు వచ్చింది. గోల్డ్‌ మెడల్‌ కోసం జరిగిన ఈ తుది పోరులో శ్రేయస్‌ అయ్యర్‌ టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. ఫైనల్‌కు ముందు భారత్‌ సెమీఫైనల్లో శ్రీలంకను 124 పరుగుల తేడాతో ఓడించగా పాకిస్థాన్‌ బంగ్లాదేశ్‌పై విజయం సాధించి తుది సమరానికి చేరుకుంది.

ఇదిలా ఉంటే ఏషియన్‌ గేమ్స్‌లోని ఇతర క్రీడల్లో భారత్‌, పాకిస్థాన్‌ ఆటగాళ్లు సాధారణంగానే పరస్పరం అభినందించుకున్న దృశ్యాలు కనిపించాయి. కానీ క్రికెట్‌లో మాత్రం ఇటీవలి మ్యాచ్‌ల మాదిరిగానే షేక్‌హ్యాండ్‌కు దూరంగా ఉండటం ప్రత్యేకంగా నిలిచింది. షేక్‌హ్యాండ్‌ విషయంలో అంతర్జాతీయ క్రీడా వేదికలపై ఒకే విధమైన తప్పనిసరి ఆచారం ఉండదు. మ్యాచ్‌ ముందు లేదా తర్వాత చేతులు కలుపుకోవడం సాధారణంగా క్రీడాస్ఫూర్తికి సంబంధించిన సంప్రదాయంగా కొనసాగుతోంది. మహిళల క్రికెట్‌లో భారత్‌ స్వర్ణం, పాకిస్థాన్‌ కాంస్యం సాధించినప్పటికీ ఈ రెండు జట్లు పరస్పరం తలపడలేదు. పురుషుల ఫైనల్లో మాత్రం ఇరు జట్లు నేరుగా ఎదురుపడటంతో కెప్టెన్ల షేక్‌హ్యాండ్‌ లేకపోవడం మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. మొత్తంగా గోల్డ్‌ మెడల్‌ కోసం భారత్‌, పాకిస్థాన్‌ మధ్య క్రికెట్‌ సమరం ఉత్కంఠగా సాగుతుండగా మ్యాచ్‌ ప్రారంభానికి ముందే ‘నో హ్యాండ్‌షేక్‌’ సీన్‌ మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. ప్రసుతం భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ప్రెసెంట్ స్కోర్ IND:11.3 OVERS లో 122/3 పై కొనసాగుతుంది.

banner

You may also like

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More