Saturday, August 1, 2026
Chat on WhatsApp
HomeAndhra PradeshJune 26 Holiday | విద్యార్థులు, ఉద్యోగులకు గుడ్ న్యూస్.. జూన్ 26న రాష్ట్రవ్యాప్తంగా సెలవు

June 26 Holiday | విద్యార్థులు, ఉద్యోగులకు గుడ్ న్యూస్.. జూన్ 26న రాష్ట్రవ్యాప్తంగా సెలవు

-

Chat on WhatsApp

June 26 Holiday: విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మొహర్రం పండుగ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా జూన్ 26వ తేదీన సాధారణ సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, బ్యాంకులతో పాటు పలు సంస్థలకు కూడా ఈ సెలవు వర్తించనుంది. వాస్తవానికి సాధారణ సెలవుల క్యాలెండర్ ప్రకారం మొహర్రం సందర్భంగా జూన్ 25న సెలవు ఉండాల్సి ఉంది.

అయితే పండుగ తేదీ విషయంలో వచ్చిన తాజా సమాచారం నేపథ్యంలో ప్రభుత్వం సెలవు తేదీలో మార్పులు చేసింది. రాష్ట్ర వక్ఫ్ బోర్డు సీఈవో నుంచి అందిన అధికారిక సమాచారం ప్రకారం మొహర్రం వేడుకలు జూన్ 26న నిర్వహించనున్నట్లు స్పష్టత రావడంతో, ప్రభుత్వం వెంటనే స్పందించి సెలవును ఒక రోజు వాయిదా వేసింది. ఈ మేరకు జూన్ 25కు బదులుగా జూన్ 26వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా సాధారణ సెలవు అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది.

ఈ నిర్ణయం అన్ని ప్రభుత్వ శాఖలు, విద్యాసంస్థలు, బ్యాంకులు, ఇతర సంస్థలకు వర్తిస్తుందని పేర్కొంది. వేసవి సెలవుల అనంతరం జూన్ 12 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలలు తిరిగి ప్రారంభమైన విషయం తెలిసిందే. పాఠశాలలు ప్రారంభమైన కొద్ది రోజులకే విద్యార్థులకు తొలి ప్రభుత్వ సెలవు లభించనుంది. మొహర్రం సందర్భంగా జూన్ 26న విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు సెలవును వినియోగించుకోనున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

India Condemns Pakistan Army Over Reported Civilian Killings in PoK

PoK | శాంతియుత నిరసనలపై కాల్పులు.. పాక్ చర్యలపై భారత్ ఆగ్రహం

PoK: పీఓకేలో మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించిన ఆరోపణలపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. శాంతియుతంగా నిరసనలు చేపట్టిన ప్రజలపై కాల్పులు జరపడం, మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడటం ఆందోళనకరమని పేర్కొంది. ఈ ఘటనలపై...
- Advertisement -
Chat on WhatsApp