Monday, July 13, 2026
Chat on WhatsApp
HomeSportsStephen Fleming | 18 ఏళ్ల బంధానికి ముగింపు.. సీఎస్‌కేకు గుడ్‌బై చెప్పిన స్టీఫెన్ ఫ్లెమింగ్

Stephen Fleming | 18 ఏళ్ల బంధానికి ముగింపు.. సీఎస్‌కేకు గుడ్‌బై చెప్పిన స్టీఫెన్ ఫ్లెమింగ్

-

Chat on WhatsApp

Stephen Fleming: ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కోచ్‌లలో ఒకరిగా గుర్తింపు పొందిన స్టీఫెన్ ఫ్లెమింగ్, చెన్నై సూపర్ కింగ్స్‌తో తన సుదీర్ఘ ప్రయాణానికి ముగింపు పలికాడు. దాదాపు 18 సంవత్సరాలుగా కొనసాగిన ఈ అనుబంధం పరస్పర అంగీకారంతో ముగిసినట్లు సీఎస్‌కే ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించింది. ఈ వార్తతో చెన్నై అభిమానులు భావోద్వేగానికి గురయ్యారు.

2008లో ఐపీఎల్ ప్రారంభ సీజన్‌లో ఆటగాడిగా సీఎస్‌కేలో చేరిన ఫ్లెమింగ్, ఏడాది తర్వాత ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. ఆ తర్వాత జట్టును విజయాల బాట పట్టిస్తూ ఐదు ఐపీఎల్ ట్రోఫీలు, రెండు ఛాంపియన్స్ లీగ్ టీ20 టైటిళ్లు అందించాడు. అతడి నాయకత్వంలో చెన్నై సూపర్ కింగ్స్ 12 సార్లు ప్లేఆఫ్స్‌కు చేరి, 10 ఫైనల్స్ ఆడిన జట్టుగా ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. ఇటీవలి మూడు సీజన్లలో జట్టు ఆశించిన ఫలితాలు సాధించకపోవడంతో ఫ్లెమింగ్ భవిష్యత్తుపై అనేక ఊహాగానాలు వినిపించాయి. చివరకు రెండు పక్షాల మధ్య జరిగిన చర్చల అనంతరం విడిపోవాలనే నిర్ణయం తీసుకున్నట్లు ఫ్రాంచైజీ వెల్లడించింది.

సీఎస్‌కే యజమాని రూపా గురునాథ్ మాట్లాడుతూ, జట్టు విజయాల వెనుక ఫ్లెమింగ్ పాత్ర అసాధారణమని కొనియాడారు. ఆయన కేవలం కోచ్ మాత్రమే కాకుండా, జట్టుకు ప్రత్యేకమైన సంస్కృతి, క్రమశిక్షణ, స్థిరత్వాన్ని అందించిన నాయకుడని తెలిపారు. మేనేజింగ్ డైరెక్టర్ కేఎస్ విశ్వనాథన్ కూడా ఆటగాళ్లలో అత్యుత్తమ ప్రతిభను వెలికితీయడంలో ఫ్లెమింగ్‌కు ప్రత్యేక నైపుణ్యం ఉందని పేర్కొన్నారు.

తన వీడ్కోలు సందర్భంగా స్పందించిన ఫ్లెమింగ్, సీఎస్‌కేతో గడిపిన 18 ఏళ్లు తన జీవితంలో మరపురాని అధ్యాయమని చెప్పారు. విజయాలు, సవాళ్లు, అభిమానుల ప్రేమ అన్నీ తనకు చిరకాలం గుర్తుండిపోతాయని పేర్కొంటూ, ఇకపై కూడా సీఎస్‌కేకు అభిమానిగా మద్దతు ఇస్తానని భావోద్వేగంగా తెలిపారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

షాబాద్ సామూహిక హత్యల కేసు నిందితుడి రాజ్‌కుమార్ మృతదేహం లభ్యం

Shabad Mass Murder Case: షాబాద్ మండలం దైవాలగూడలో చోటుచేసుకున్న సామూహిక హత్యల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా పోలీసులు గుర్తించిన రాజ్‌కుమార్ మృతదేహం రంగారెడ్డి జిల్లా కొత్తూరు...
- Advertisement -
Chat on WhatsApp