Friday, August 7, 2026
Chat on WhatsApp
HomeBusinessGold Price Today | బంగారం కొనాలనుకుంటున్నారా?.. నేటి ధరలు చూసి షాక్ అవుతారు!

Gold Price Today | బంగారం కొనాలనుకుంటున్నారా?.. నేటి ధరలు చూసి షాక్ అవుతారు!

-

Chat on WhatsApp

Gold Price Today: బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి మరోసారి షాక్ తగిలింది. కొద్ది రోజుల పాటు స్థిరంగా కొనసాగిన పసిడి ధరలు మళ్లీ పెరుగుదల బాట పట్టడంతో మార్కెట్‌లో కొనుగోలుదారుల దృష్టి మరోసారి గోల్డ్‌పై పడింది. అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో సురక్షిత పెట్టుబడులపై ఆసక్తి పెరగడం ఈ పెరుగుదలకు ప్రధాన కారణంగా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇరాన్-అమెరికా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక-రాజకీయ అనిశ్చితి కారణంగా పెట్టుబడిదారులు బంగారాన్ని ఆశ్రయిస్తున్నారు. దీంతో అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం దేశీయ బులియన్ మార్కెట్‌పైనా కనిపిస్తోంది.

ఇటీవల ఒక్కరోజులోనే 24 క్యారెట్ల బంగారం ధర భారీగా పెరగగా, తాజా ట్రేడింగ్‌లో కూడా ధరలు స్వల్పంగా ఎగిశాయి. శుక్రవారం (ఆగస్టు 7) ఉదయం నమోదైన ధరల ప్రకారం, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,49,740, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,37,260గా నమోదైంది. మరోవైపు వెండి కిలో ధర రూ.100 తగ్గి రూ.2,39,900కు చేరింది.

హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం రూ.1,49,740, 22 క్యారెట్ల బంగారం రూ.1,37,260గా ఉండగా, వెండి కిలో ధర రూ.2,50,100గా కొనసాగుతోంది. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం రూ.1,49,870, 22 క్యారెట్ల బంగారం రూ.1,37,410గా నమోదైంది. స్థానిక పన్నులు, మేకింగ్ ఛార్జీలు, మార్కెట్ పరిస్థితుల ఆధారంగా నగరాల వారీగా ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Indian chess Grandmaster Praggnanandhaa

Praggnanandhaa | 20 ఏళ్ల వయసులో అరుదైన ఘనత..  ప్రజ్ఞానంద ఖాతాలో మరో ప్రతిష్టాత్మక టైటిల్!

Praggnanandhaa: చదరంగ ప్రపంచంలో మరోసారి భారత జెండాను రెపరెపలాడించాడు యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద. కేవలం 20 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ వేదికపై తన సత్తా చాటుతూ మరో ప్రతిష్టాత్మక విజయాన్ని అందుకున్నాడు. అమెరికాలో...
- Advertisement -
Chat on WhatsApp