Wednesday, August 5, 2026
Chat on WhatsApp
HomeAndhra PradeshYadgir Chemical Factory Accident |  విషవాయువు లీక్ కలకలం.. యాద్గిర్ పరిశ్రమలో ముగ్గురు కార్మికుల దుర్మరణం

Yadgir Chemical Factory Accident |  విషవాయువు లీక్ కలకలం.. యాద్గిర్ పరిశ్రమలో ముగ్గురు కార్మికుల దుర్మరణం

-

Chat on WhatsApp

Yadgir Chemical Factory Accident: కర్ణాటక రాష్ట్రంలోని యాద్గిర్ జిల్లాలో ఓ రసాయన పరిశ్రమలో జరిగిన విషవాయువు లీకేజీ ఘోర విషాదానికి దారితీసింది. ఈ ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఓ యువకుడితో పాటు మొత్తం ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో ఒకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బుధవారం తెల్లవారుజామున 1 నుంచి 2 గంటల మధ్య ఈ దుర్ఘటన జరిగింది.

రసాయన పరిశ్రమలో అకస్మాత్తుగా విషవాయువు లీక్ కావడంతో విధుల్లో ఉన్న ఐదుగురు కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురై అక్కడికక్కడే కుప్పకూలారు. వెంటనే సహచరులు వారిని ఆస్పత్రికి తరలించగా, ముగ్గురు ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు. వెంటనే వారిని రాయచూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (RIMS)కు తరలించగా, ముగ్గురు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుల్లో తెలంగాణ రాష్ట్రం నారాయణపేట జిల్లా కృష్ణ మండలం ఆలంపల్లికి చెందిన గణేశ్‌తో పాటు మధ్యప్రదేశ్‌లోని కట్నీ జిల్లాకు చెందిన విక్రమ్, సంజయ్ ఉన్నారు.

వీరంతా 20 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన యువకులని అధికారులు వెల్లడించారు. ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాకు చెందిన హేమంత్, శివకుమార్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఘటనపై సమాచారం అందుకున్న యాద్గిర్ జిల్లా ఎస్పీ పృథ్విక్ శంకర్ సంఘటన స్థలాన్ని పరిశీలించి, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Ishan Kishan at the RBI Patna regional office after joining as Assistant Manager under the sports quota.

Ishan Kishan | క్రికెట్, ప్రభుత్వ ఉద్యోగం రెండూ కలిసి.. ఇషాన్ కిషన్ డబుల్...

Ishan Kishan: టీమిండియా వికెట్ కీపర్-బ్యాటర్ ఇషాన్ కిషన్ తన కెరీర్‌లో మరో కీలక మైలురాయిని చేరుకున్నారు. క్రికెట్ కెరీర్‌తో పాటు ప్రభుత్వ ఉద్యోగంలో అడుగుపెట్టిన ఆయన, "రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)"లో అసిస్టెంట్...
- Advertisement -
Chat on WhatsApp