Wednesday, August 5, 2026
Chat on WhatsApp
HomeAndhra PradeshGreenfield Highway | తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్.. ఖమ్మం-దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవే సిద్ధం!

Greenfield Highway | తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్.. ఖమ్మం-దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవే సిద్ధం!

-

Chat on WhatsApp

Greenfield Highway: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య రహదారి అనుసంధానాన్ని మరింత బలోపేతం చేసే తొలి యాక్సెస్ కంట్రోల్ గ్రీన్‌ఫీల్డ్ హైవే (NH-365 BG) వచ్చే వారం నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. ఖమ్మం నుంచి దేవరపల్లి(Khammam-Devarapalli) వరకు నిర్మించిన ఈ ఆధునిక హైవేకు సంబంధించిన రోడ్లు, వంతెనల పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా తుది పరిశీలన పూర్తి చేయగా, అధికారిక ప్రారంభానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొత్తం 162.04 కిలోమీటర్ల పొడవుతో నాలుగు లేన్లుగా నిర్మించిన ఈ హైవేలో ఖమ్మం జిల్లాలోనే 105 కిలోమీటర్ల మేర రహదారి ఉంది.

మూడు ప్యాకేజీల్లో సుమారు రూ.2,213.91 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును పూర్తి చేశారు. ఈ హైవే అందుబాటులోకి రావడంతో హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే ప్రయాణ దూరం దాదాపు 56 కిలోమీటర్లు తగ్గనుంది, దీంతో సమయం, ఇంధన వ్యయం రెండూ ఆదా కానున్నాయి. సూర్యాపేట వైపు నుంచి వచ్చే వాహనాలు తెల్దారుపల్లి టోల్ గేట్ ద్వారా హైవేపైకి ప్రవేశించి, దేవరపల్లి సమీపంలోని ఎగ్జిట్ ద్వారా బయటకు వెళ్తాయి. ప్రయాణించిన దూరానికి అనుగుణంగానే టోల్ వసూలు చేసే విధానాన్ని అమలు చేయనున్నారు. భద్రత కోసం ప్రతి కిలోమీటరుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు, భారీ వాహనాల కోసం ట్రక్ లే-బైలు కూడా నిర్మించారు. భవిష్యత్తులో ఈ హైవే అమరావతి-నాగ్‌పూర్ గ్రీన్‌ఫీల్డ్ కారిడార్‌తో అనుసంధానం కానుండటంతో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రవాణా మరింత వేగవంతం కానుంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Ishan Kishan at the RBI Patna regional office after joining as Assistant Manager under the sports quota.

Ishan Kishan | క్రికెట్, ప్రభుత్వ ఉద్యోగం రెండూ కలిసి.. ఇషాన్ కిషన్ డబుల్...

Ishan Kishan: టీమిండియా వికెట్ కీపర్-బ్యాటర్ ఇషాన్ కిషన్ తన కెరీర్‌లో మరో కీలక మైలురాయిని చేరుకున్నారు. క్రికెట్ కెరీర్‌తో పాటు ప్రభుత్వ ఉద్యోగంలో అడుగుపెట్టిన ఆయన, "రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)"లో అసిస్టెంట్...
- Advertisement -
Chat on WhatsApp