Wednesday, July 29, 2026
Chat on WhatsApp
HomeInterNationalKhawaja Asif | 'వాళ్లు కూడా భారత్‌లాంటి శత్రువులే'.. PoKపై పాక్ మంత్రి సంచలన వ్యాఖ్యలు

Khawaja Asif | ‘వాళ్లు కూడా భారత్‌లాంటి శత్రువులే’.. PoKపై పాక్ మంత్రి సంచలన వ్యాఖ్యలు

-

Chat on WhatsApp

Pakistan: పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌ (PoK)లో కొనసాగుతున్న నిరసనలపై ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్( Khawaja Asif) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారిని భారత్‌తో సమానంగా చూస్తున్నామని, వారు కూడా పాకిస్థాన్‌కు శత్రువులేనని ఆయన వ్యాఖ్యానించారు. నిరసనకారులతో చర్చలకు అవకాశం లేదని స్పష్టం చేస్తూ, భద్రత దృష్ట్యా తీసుకున్న చర్యలను సమర్థించారు.

ఇటీవల PoKలో జరిగిన ఘటనల్లో 14 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత వివాదాస్పదంగా మారాయి. శాంతియుత నిరసనలపై భద్రతా బలగాలు కాల్పులు జరపడం తప్పు కాదనే రీతిలో ఆయన స్పందించడంపై మానవ హక్కుల వర్గాలు, రాజకీయ విశ్లేషకులు విమర్శలు గుప్పిస్తున్నారు.

మరోవైపు ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో కూడా తీవ్ర స్పందన వ్యక్తమవుతోంది. PoK ప్రజలను భారత్‌తో పోల్చడం ద్వారా పాకిస్థాన్‌నే తమ వాదనను బలపరిచిందని పలువురు నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. సొంత ప్రజల అసంతృప్తిని పరిష్కరించకుండా, నిరసనలను అణిచివేసే ప్రయత్నం చేయడం పాకిస్థాన్ ప్రభుత్వ వైఖరిని మరోసారి బయటపెట్టిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారం అంతర్జాతీయ స్థాయిలో కూడా చర్చనీయాంశంగా మారుతోంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Supreme Court

Supreme Court | లైవ్ వీడియో ఉంటుంది.. కానీ ఆడియో ఉండదు! సుప్రీంకోర్టు కీలక...

Supreme Court: సుప్రీంకోర్టు వర్చువల్‌ విచారణ విధానంలో కీలక మార్పు చోటుచేసుకుంది. ఇకపై అత్యవసర కేసులపై న్యాయవాదులు చేసే మెన్షనింగ్‌ సమయంలో జరిగే సంభాషణలు లైవ్‌ స్ట్రీమింగ్‌లో వినిపించవు. ఈ మేరకు ప్రధాన...
- Advertisement -
Chat on WhatsApp