Wednesday, July 29, 2026
Chat on WhatsApp
HomeAndhra PradeshGlasgow Games | తండ్రి బాటలో తనయుడు.. ప్రశంసలతో ముంచెత్తిన చంద్రబాబు, లోకేశ్

Glasgow Games | తండ్రి బాటలో తనయుడు.. ప్రశంసలతో ముంచెత్తిన చంద్రబాబు, లోకేశ్

-

Chat on WhatsApp

Glasgow Games: గ్లాస్గో వేదికగా జరుగుతున్న 2026 కామన్వెల్త్ గేమ్స్‌(Commonwealth Games 2026)లో భారత వెయిట్‌లిఫ్టర్ వల్లూరి అజయ్ బాబు సత్తా చాటాడు. పురుషుల 79 కేజీల విభాగంలో అద్భుత ప్రదర్శన కనబరిచి రజత పతకాన్ని సాధించాడు. చిన్ననాటి నుంచే క్రీడా వాతావరణంలో పెరిగిన అజయ్.. తన తండ్రి, కామన్వెల్త్ కాంస్య పతక విజేత వల్లూరి శ్రీనివాసరావు నుంచి స్ఫూర్తి పొంది అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు.

అజయ్ సాధించిన ఈ ఘనతపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో 79 కేజీల వెయిట్‌లిఫ్టింగ్‌లో రజతం సాధించడం రాష్ట్రంతో పాటు దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. తండ్రి చూపిన మార్గంలో నడుస్తూ అజయ్ తన ప్రతిభతో భారత క్రీడా వారసత్వాన్ని మరింత ముందుకు తీసుకెళ్తున్నాడని ప్రశంసించారు. మంత్రి నారా లోకేశ్ కూడా అజయ్ విజయంపై స్పందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ అజయ్ ప్రపంచ వేదికపై భారత క్రీడా సత్తాను మరోసారి చాటాడని ప్రశంసించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి దేశానికి మరింత పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

ఒకే కుటుంబం నుంచి వచ్చిన ఇద్దరు క్రీడాకారులు కామన్వెల్త్ వేదికపై పతకాలు సాధించడం ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. అజయ్ సాధించిన ఈ విజయం యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తుందని క్రీడాభిమానులు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Burj Khalifa Introduces UPI Ticket Booking for Indian Tourists

Burj Khalifa | బుర్జ్ ఖలీఫా సందర్శన ఇక మరింత సులభం.. UPIతో ఆన్‌లైన్...

Burj Khalifa: దుబాయ్‌లోని ప్రపంచ ప్రఖ్యాత బుర్జ్ ఖలీఫా సందర్శించాలనుకునే భారతీయ పర్యాటకులకు గుడ్‌న్యూస్. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా సందర్శన కోసం ఇప్పుడు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI)...
- Advertisement -
Chat on WhatsApp