Tuesday, July 28, 2026
Chat on WhatsApp
HomeTelanganaవిలువల రాజకీయాలకు చిరునామా జైపాల్ రెడ్డి.. మంత్రుల ఘన నివాళులు

విలువల రాజకీయాలకు చిరునామా జైపాల్ రెడ్డి.. మంత్రుల ఘన నివాళులు

-

Chat on WhatsApp

మాజీ కేంద్ర మంత్రి, ప్రముఖ రాజకీయవేత్త జైపాల్ రెడ్డి సేవలను మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి( Komatireddy Venkat Reddy), శ్రీధర్ బాబు స్మరించుకున్నారు. ఆయన 7వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ‘స్ఫూర్తి స్థల్’ వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జైపాల్ రెడ్డి రాజకీయ ప్రస్థానం, ప్రజా సేవలను గుర్తు చేసుకున్నారు. ప్రజా జీవితంలో విలువలు, సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసిన అరుదైన నాయకుల్లో జైపాల్ రెడ్డి ఒకరని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. తన వాక్చాతుర్యం, పార్లమెంటరీ పరిజ్ఞానంతో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందారని అన్నారు.

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆయన అందించిన సహకారం ఎప్పటికీ గుర్తుండిపోతుందని తెలిపారు. జైపాల్ రెడ్డి ఆలోచనా విధానం, ప్రజాసేవా స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని మంత్రులు పేర్కొన్నారు. యువత ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని సూచించారు. జైపాల్ రెడ్డి ఆశయాలు, ప్రజా సంక్షేమ లక్ష్యాలకు అనుగుణంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Glasgow Games | తండ్రి బాటలో తనయుడు.. ప్రశంసలతో ముంచెత్తిన చంద్రబాబు, లోకేశ్

Glasgow Games: గ్లాస్గో వేదికగా జరుగుతున్న 2026 కామన్వెల్త్ గేమ్స్‌(Commonwealth Games 2026)లో భారత వెయిట్‌లిఫ్టర్ వల్లూరి అజయ్ బాబు సత్తా చాటాడు. పురుషుల 79 కేజీల విభాగంలో అద్భుత ప్రదర్శన కనబరిచి రజత...
- Advertisement -
Chat on WhatsApp