Wednesday, July 29, 2026
Chat on WhatsApp
HomeInterNationalWisconsin Tornado | ప్రకృతి ప్రకోపం.. విస్కాన్సిన్‌లో టోర్నడో కల్లోలం, 3.9 లక్షల ఇళ్లకు నిలిచిన విద్యుత్ సరఫరా

Wisconsin Tornado | ప్రకృతి ప్రకోపం.. విస్కాన్సిన్‌లో టోర్నడో కల్లోలం, 3.9 లక్షల ఇళ్లకు నిలిచిన విద్యుత్ సరఫరా

-

Chat on WhatsApp

Wisconsin Tornado: అమెరికాలోని విస్కాన్సిన్ రాష్ట్రంపై ప్రకృతి ప్రకోపం విరుచుకుపడింది. ఒక్కసారిగా దూసుకొచ్చిన శక్తివంతమైన టోర్నడో భారీ విధ్వంసాన్ని సృష్టించింది. బలమైన గాలుల ధాటికి పలు ప్రాంతాల్లో ఇళ్లు దెబ్బతినగా, విద్యుత్ వ్యవస్థ స్తంభించిపోయింది. ఈ తుపాను ప్రభావంతో లక్షలాది మంది ప్రజలు చీకట్లో గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. సోమవారం వీచిన బలమైన గాలులతో కూడిన ఈ తుపాను ప్రభావం మధ్య పశ్చిమ ప్రాంతంలోని పలు రాష్ట్రాలపై పడింది. విస్కాన్సిన్‌లోని మెనాషా, యాపిల్‌టన్ నగరాలు ఎక్కువగా ప్రభావితమయ్యాయి.

టోర్నడో ధాటికి ఇళ్ల పైకప్పులు ఎగిరిపోగా, పెద్ద సంఖ్యలో చెట్లు నేలకూలాయి. విద్యుత్ స్తంభాలు దెబ్బతినడంతో దాదాపు 3.9 లక్షల ఇళ్లకు కరెంట్ సరఫరా నిలిచిపోయింది. వాతావరణ శాఖ ప్రకారం, ఈ టోర్నడో దాదాపు 20 నిమిషాల పాటు విధ్వంసం సృష్టించింది. ప్రమాదకర స్థాయిలో ఉన్న ఈ తుపాను కారణంగా జరిగిన నష్టాన్ని అధికారులు అంచనా వేస్తున్నారు. శిథిలాల మధ్య ఎవరైనా చిక్కుకుని ఉన్నారా అనే విషయాన్ని తెలుసుకునేందుకు సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఇదే సమయంలో వైట్‌వాటర్ ప్రాంతంలో చెట్ల కొమ్మలను తొలగించే పనిలో ఉన్న విద్యుత్ శాఖ ఉద్యోగి పిడుగుపాటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు.

టోర్నడో తర్వాత సహాయక చర్యల్లో నిమగ్నమైన సిబ్బంది భద్రతపై కూడా అధికారులు దృష్టి సారించారు. మరోవైపు గ్రేట్ లేక్స్, ఒహాయో వ్యాలీ ప్రాంతాల్లో మళ్లీ తీవ్ర ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అమెరికా వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో అధికారులు సూచించే భద్రతా చర్యలను పాటించాలని సూచించింది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Newly discovered Croton Ubbalamadugensis plant species in the Eastern Ghats

Pawan Kalyan | తిరుపతిలో గుర్తించిన అరుదైన మొక్కకు పేరు పెట్టిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌లో మరో అరుదైన వృక్షజాతి వెలుగులోకి వచ్చింది. తిరుపతి జిల్లా తూర్పు కనుమల్లో గుర్తించిన కొత్త మొక్కకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ "క్రోటన్ ఉబ్బలమడుగెన్సిస్"...
- Advertisement -
Chat on WhatsApp