భారత క్రూయిజర్ బైక్ మార్కెట్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న బజాజ్ అవెంజర్ శ్రేణికి తాజాగా ఒక కొత్త వెర్షన్ వచ్చింది. బజాజ్ ఆటో తన 2026 అవెంజర్ స్ట్రీట్ 220 మోడల్‌ను(Bajaj Avenger Street 220) భారత మార్కెట్లో అధికారికంగా లాంచ్ చేసింది. ఈ క్రూయిజర్ బైక్ ప్రారంభ ధరను రూ.1.30 లక్షల (ఎక్స్-షోరూమ్)గా కంపెనీ ఖరారు చేసింది. స్టైలిష్ డిజైన్, సౌకర్యవంతమైన రైడింగ్ పొజిషన్, శక్తివంతమైన ఇంజన్‌తో ఇది క్రూయిజర్ బైక్ ప్రేమికులను లక్ష్యంగా చేసుకుంది.
ఇప్పటి వరకు అవెంజర్ లైనప్‌లో స్ట్రీట్ 160, క్రూయిజ్ 220 మోడళ్లు ఉండేవి. అయితే కంపెనీ స్ట్రీట్ 160ను నిలిపివేసి దాని స్థానంలో మరింత శక్తివంతమైన స్ట్రీట్ 220ను తీసుకొచ్చింది. దీంతో అవెంజర్ శ్రేణి పూర్తిగా 220cc సెగ్మెంట్పైకి మారింది. డిజైన్ పరంగా అవెంజర్ స్ట్రీట్ 220ను ఎబోనీ బ్లాక్, కాక్టెయిల్ వైన్ రెడ్ రంగుల్లో విడుదల చేశారు. తక్కువ సీట్ ఎత్తు, పొడవైన హ్యాండిల్‌బార్, ఫార్వర్డ్ ఫుట్‌పెగ్స్ వంటి అంశాలు లాంగ్ రైడ్స్‌కు అనుకూలంగా ఉంటాయి.
ఇంజన్ విషయానికి వస్తే ఇందులో 220cc ఎయిర్/ఆయిల్-కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 8,500 rpm వద్ద 19 bhp పవర్, 7,000 rpm వద్ద 17.6 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో ఈ బైక్ నగర ప్రయాణాలు మరియు హైవే రైడింగ్‌కు అనువుగా ఉంటుంది. మొత్తంగా బజాజ్ అవెంజర్ స్ట్రీట్ 220తో పనితీరు మరియు స్టైలింగ్ మధ్య మంచి సమతుల్యతను తీసుకువచ్చే ప్రయత్నం చేసింది.
Bajaj Avenger Street 220 | మార్కెట్లో సంచలనం.. కొత్త అవెంజర్ స్ట్రీట్ 220 వచ్చేసింది, ఫీచర్లు, ధర ఇవే
-








