Thursday, April 2, 2026
Chat on WhatsApp
HomeSportsIPL 2026 లో ఒక్కో మ్యాచ్ తర్వాత పాయింట్స్ టేబుల్ అప్‌డేట్.. అగ్రస్థానంలో ఎవరంటే?

IPL 2026 లో ఒక్కో మ్యాచ్ తర్వాత పాయింట్స్ టేబుల్ అప్‌డేట్.. అగ్రస్థానంలో ఎవరంటే?

-

Chat on WhatsApp

ఐపీఎల్ 2026(IPL 2026) సీజన్ ప్రారంభం నుంచే ఉత్కంఠభరితంగా సాగుతోంది. మార్చి 28న ప్రారంభమైన ఈ టోర్నీలో ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు పూర్తయ్యాయి. మొత్తం 10 జట్లు తలో మ్యాచ్ ఆడి తమ ప్రయాణాన్ని మొదలుపెట్టాయి.

గెలిచిన జట్లకు రెండు పాయింట్లు వచ్చినప్పటికీ, నెట్ రన్‌రేట్ (NRR) ఆధారంగా పాయింట్ల పట్టికలో స్థానాలు మారాయి.

ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) అగ్రస్థానంలో నిలిచింది. చెన్నైపై భారీ విజయంతో ఆ జట్టు +4.171 నెట్ రన్‌రేట్ నమోదు చేసి టేబుల్ టాపర్‌గా మారింది. రెండో స్థానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు +2.907 ఎన్‌ఆర్‌ఆర్‌తో ఉంది. మూడో స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ +1.397 నెట్ రన్‌రేట్‌తో నిలిచింది.

ఇక నాలుగో స్థానంలో ముంబై ఇండియన్స్ +0.687 ఎన్‌ఆర్‌ఆర్‌తో ఉండగా, ఐదో స్థానంలో పంజాబ్ కింగ్స్ +0.509 నెట్ రన్‌రేట్‌తో కొనసాగుతోంది. ఓటమితో సీజన్ ప్రారంభించిన జట్లలో గుజరాత్ టైటాన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా ఆరో నుంచి పదో స్థానాల్లో ఉన్నాయి. ఇందులో చెన్నై సూపర్ కింగ్స్ -4.171 నెట్ రన్‌రేట్‌తో చివరి స్థానంలో పడిపోయింది.

ఇంకా ప్రతి జట్టుకు లీగ్ దశలో 13 మ్యాచ్‌లు మిగిలి ఉండటంతో పాయింట్ల పట్టికలో పెద్ద మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. లీగ్ ముగిసే సమయానికి టాప్-2లో ఉన్న జట్లు క్వాలిఫయర్-1, మూడో-నాలుగో స్థానాల్లో ఉన్న జట్లు ఎలిమినేటర్ ఆడతాయి.

మొదటి మ్యాచ్ నుంచే సీఎస్‌కే తడబడటం అభిమానుల్లో ఆందోళన పెంచుతుండగా, రాజస్థాన్, బెంగళూరు, ఢిల్లీ జట్లు బలమైన ఆరంభంతో టైటిల్ రేసులో ముందంజలో నిలిచాయి.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

india defense minister rajnath singh issues stern warning to pakistan over potential provocations

Rajnath Singh | పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ వార్నింగ్….భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదు

Rajnath Singh: ఇరాన్‌లో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో భారత్ పరోక్షంగా పాకిస్థాన్‌కు కఠిన సందేశం పంపింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కేరళలోని తిరువనంతపురంలో నిర్వహించిన కార్యక్రమంలో, ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితులను...
- Advertisement -
Chat on WhatsApp