Friday, August 7, 2026
Chat on WhatsApp
HomeInterNationalT20 World Cup 2026 | టీ20 వరల్డ్ కప్‌లో ఐస్లాండ్ ట్రోలింగ్..బాంగ్లాదేశ్ బాటలో పాకిస్తాన్?

T20 World Cup 2026 | టీ20 వరల్డ్ కప్‌లో ఐస్లాండ్ ట్రోలింగ్..బాంగ్లాదేశ్ బాటలో పాకిస్తాన్?

-

Chat on WhatsApp

T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్‌ నుంచి బంగ్లాదేశ్ అధికారికంగా నిష్క్రమించింది. భారత్‌లో మ్యాచ్‌లు ఆడేందుకు భద్రతా కారణాలు చూపుతూ బంగ్లాదేశ్ వివాదానికి దిగగా, ఐసీసీ వారి స్థానంలో స్కాట్లాండ్‌ను టోర్నీలోకి తీసుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలో బంగ్లాదేశ్‌కు మద్దతుగా పాకిస్తాన్( Bangladesh) కూడా టీ20 వరల్డ్ కప్‌ను బహిష్కరిస్తుందనే వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఐస్లాండ్ క్రికెట్(Iceland) సోషల్ మీడియా వేదికగా పాకిస్తాన్‌పై సరదాగా ట్రోలింగ్ చేసింది.
“పాకిస్తాన్ ఆడకూడదనుకుంటే త్వరగా చెప్పండి. ఫిబ్రవరి 2న వైదొలిగితే మేము వెంటనే బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాం.

ఫిబ్రవరి 7 తర్వాత అయితే విమానాల సమస్య ఉంటుంది, కొలంబో చేరగలమో లేదో తెలియదు” అంటూ ఐస్లాండ్ క్రికెట్ సెటైరికల్ పోస్ట్ చేసింది. ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.

ఇదిలా ఉండగా, పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ (PCB) బంగ్లాదేశ్‌కు సంఘీభావంగా టోర్నీ నుంచి తప్పుకునే అంశాన్ని పరిశీలిస్తోంది. ఇటీవల పీసీబీ చీఫ్ మొహ్సీన్ నఖ్వీ, పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్‌తో భేటీ అయ్యారు. ఈ శుక్రవారం లేదా సోమవారం తమ తుది నిర్ణయాన్ని వెల్లడిస్తామని నఖ్వీ తెలిపారు.

ప్రస్తుతం పాకిస్తాన్ తమ అన్ని మ్యాచ్‌లను శ్రీలంకలో ఆడుతుండగా, బంగ్లాదేశ్‌కు కూడా తటస్థ వేదిక అవకాశం ఇవ్వాలని పీసీబీ డిమాండ్ చేసింది. అయితే ఐసీసీ అంగీకరించకపోవడంతో బంగ్లాదేశ్ టోర్నీ నుంచి వైదొలగాల్సి వచ్చింది.

also read:Sunetra Pawar | సునేత్ర పవార్ ఎన్సీపీ అధినేతగా?

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

UPI digital payment | UPI వినియోగదారులకు అలర్ట్.. కేంద్రం కొత్త నిర్ణయం ఇదే!

UPI digital payment: దేశంలో డిజిటల్ చెల్లింపులకు వెన్నెముకగా మారిన యూపీఐ (UPI) వ్యవస్థలో కీలక మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ చట్టం-2007 సవరణ బిల్లుకు...
- Advertisement -
Chat on WhatsApp