Gold and Silver Prices Today | ఆకాశాన్ని అంటుతున్న బంగారం, వెండి ధరలు….కిలో వెండి ఎంతంటే ?

Gold and Silver Prices Today Gold and Silver Prices Today

 Gold and Silver Prices Today : బంగారం వెండి నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతున్నాయి. తాజా సమాచారం దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం–వెండి ధరలు(Gold and Silver) రికార్డు స్థాయికి చేరాయి. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో దేశీయ బులియన్ మార్కెట్‌లో ధరలు ఒక్కసారిగా దూసుకెళ్లాయి.

బంగారం ధర రూ.2 లక్షల దిశగా సాగుతుండగా, వెండి ధర ఫ్యూచర్స్ మార్కెట్‌లో కిలోకు రూ.4 లక్షలు దాటి చరిత్ర సృష్టించింది.

హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం ఉదయం 10 గంటల సమయంలో 24 క్యారెట్ల మేలిమి బంగారం 10 గ్రాముల ధర రూ.1,85,000 దాటింది. అదే సమయంలో కిలో వెండి ధర రూ.4,00,000కు చేరింది.

గత రాత్రి రూ.1,73,300గా ఉన్న బంగారం ధర కేవలం కొన్ని గంటల్లోనే రూ.12,000కు పైగా పెరగడం గమనార్హం. కిలో వెండి ధర గత ముగింపులో రూ.3,79,700గా ఉండగా, నేటి రోజులో రూ.21,000కు పైగా ఎగబాకింది.

మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజ్‌లో మార్చి డెలివరీ వెండి ఫ్యూచర్స్ ఒక్క రోజులోనే రూ.22,090 పెరిగి రూ.4,07,456కు చేరి జీవితకాల గరిష్ఠాన్ని నమోదు చేసింది. ఫిబ్రవరి డెలివరీ బంగారం ఫ్యూచర్స్ ధర 10 గ్రాములకు రూ.14,586 పెరిగి రూ.1,80,501కు చేరింది.

అంతర్జాతీయంగా వెండి ధర తొలిసారిగా 5,600 డాలర్ల మార్క్‌ను దాటగా, ఔన్సు వెండి ధర 119.51 డాలర్లకు చేరింది. అమెరికా డాలర్ బలహీనత, పరిశ్రమల డిమాండ్ పెరుగుదల, అలాగే భౌగోళిక–రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో మదుపర్లు బంగారం, వెండిని సురక్షిత పెట్టుబడిగా భావించడమే ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు.

also read:T20 World Cup 2026 | టీ20 వరల్డ్ కప్‌లో ఐస్లాండ్ ట్రోలింగ్..బాంగ్లాదేశ్ బాటలో పాకిస్తాన్?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *