Wednesday, July 29, 2026
Chat on WhatsApp
HomeUncategorizedఫోర్బ్స్ 2025 జాబితాలో మళ్లీ అగ్రస్థానంలో ముఖేశ్ అంబానీ

ఫోర్బ్స్ 2025 జాబితాలో మళ్లీ అగ్రస్థానంలో ముఖేశ్ అంబానీ

-

Chat on WhatsApp

ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైన ఫోర్బ్స్ 2025 “భారత అత్యంత ధనవంతుల జాబితా” విడుదలైంది. ఈసారి కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీ మరోసారి అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నారు. రూ. 9.32 లక్షల కోట్ల (సుమారు 105 బిలియన్ డాలర్ల) నికర ఆస్తులతో ఆయన భారతదేశంలో అత్యంత సంపన్నుడిగా నిలిచారు. గతేడాదితో పోలిస్తే ఆయన సంపద 12 శాతం తగ్గినా, “100 బిలియన్ డాలర్ల క్లబ్”లో కొనసాగుతున్న ఏకైక భారతీయ వ్యాపారవేత్తగానే ఫోర్బ్స్ గుర్తించింది.

గౌతమ్ అదానీ 92 బిలియన్ డాలర్ల (రూ. 8.17 లక్షల కోట్లు) సంపదతో రెండో స్థానంలో నిలిచారు. అదానీ గ్రూప్‌కు గత ఏడాది ఎదురైన మార్కెట్ క్షీణత, నియంత్రణ సవాళ్ల ప్రభావం కొంత తగ్గినా, ఆయన ఇంకా టాప్-2 స్థాయిలో నిలవడం విశేషం. ఓపీ జిందాల్ గ్రూప్ చైర్మన్ సావిత్రి జిందాల్ కుటుంబం 40.2 బిలియన్ డాలర్లతో మూడో స్థానంలో నిలిచింది. టాప్-10లో స్థానం దక్కించుకున్న ఏకైక మహిళ కూడా ఆమెనే కావడం విశేషం.

ఫోర్బ్స్ నివేదిక ప్రకారం ఈ ఏడాది భారత 100 మంది కుబేరుల మొత్తం సంపద 9 శాతం తగ్గి ట్రిలియన్ డాలర్లకు (రూ. 88.8 లక్షల కోట్లు) పరిమితమైంది. రూపాయి విలువ పతనం, స్టాక్ మార్కెట్ మార్పులు, గ్లోబల్ ఫైనాన్షియల్ ఒత్తిడులు ఈ తగ్గుదలకు ప్రధాన కారణాలని ఫోర్బ్స్ విశ్లేషించింది. జాబితాలోని మూడింట రెండొంతుల మందికి ఆస్తులు క్షీణించినప్పటికీ, కొందరు వ్యాపారవేత్తలు మాత్రం లాభపడ్డారు.

భారతీ ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ సంపద 3.5 బిలియన్ డాలర్లు పెరిగి, నాలుగో స్థానానికి చేరుకున్నారు. హెచ్‌సీఎల్ టెక్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ ఐదో స్థానంలో ఉన్నారు. టాప్-10లో పేటీఎం, ఇన్ఫోసిస్, మరియు కోటక్ గ్రూప్‌ల ప్రతినిధులు కూడా స్థానం పొందారు.

తెలుగువారికి గర్వకారణం – ఈ జాబితాలో మొత్తం ఆరుగురు తెలుగు పారిశ్రామికవేత్తలు చోటు దక్కించుకున్నారు. దివీస్ ల్యాబొరేటరీస్ అధినేత మురళి దివి రూ. 88,800 కోట్ల నికర సంపదతో 25వ స్థానంలో నిలిచి తెలుగువారిలో అగ్రగామిగా నిలిచారు.

అతనితో పాటు మేఘా ఇంజనీరింగ్ అధినేతలు పీపీ రెడ్డి, పీవీ కృష్ణా రెడ్డి (70వ ర్యాంక్), జీఎంఆర్ గ్రూప్ అధినేత గ్రంథి మల్లికార్జున రావు (83వ ర్యాంక్), అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకులు ప్రతాప్ సి.రెడ్డి (86వ ర్యాంక్), హెటిరో గ్రూప్ చైర్మన్ బి.పార్థసారధి రెడ్డి (89వ ర్యాంక్), మరియు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ అధినేత కె. సతీష్ రెడ్డి (91వ ర్యాంక్) కూడా ఫోర్బ్స్ జాబితాలో స్థానం దక్కించుకున్నారు.

ఈ జాబితా మరోసారి భారతీయ వ్యాపార ప్రపంచంలో అంబానీ ఆధిపత్యాన్ని నిర్ధారించడమే కాకుండా, తెలుగు పారిశ్రామికవేత్తల ప్రతిభను, అంతర్జాతీయ స్థాయిలో వారి వ్యాపార విస్తరణను కూడా ప్రతిబింబిస్తుంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Newly discovered Croton Ubbalamadugensis plant species in the Eastern Ghats

Pawan Kalyan | తిరుపతిలో గుర్తించిన అరుదైన మొక్కకు పేరు పెట్టిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌లో మరో అరుదైన వృక్షజాతి వెలుగులోకి వచ్చింది. తిరుపతి జిల్లా తూర్పు కనుమల్లో గుర్తించిన కొత్త మొక్కకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ "క్రోటన్ ఉబ్బలమడుగెన్సిస్"...
- Advertisement -
Chat on WhatsApp