LIVE
Wednesday, November 18, 2026
LIVE
LIVE

Yogi Adityanath | యోగి ధీమా.. ఈసారి 320 సీట్లు దాటుతాం! బీజేపీ హ్యాట్రిక్‌పై భారీ అంచనాలు!

by Bajaswamy
3 views
Yogi Adityanath

Yogi Adityanath: ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అధికార పీఠం తమదేనంటూ బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గత విజయాల రికార్డులను తిరగరాస్తామని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ధీమా వ్యక్తం చేశారు. రైజింగ్ భారత్ సమ్మిట్‌లో పాల్గొన్న యోగి ఆదిత్యనాథ్.. ఎన్నికల్లో తమ కూటమి 320కి పైగా స్థానాలను సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు. గతంలో సాధించిన విజయాల కంటే ఈసారి మరింత మెరుగైన ఫలితాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. 320 సీట్ల మార్కును దాటుతారా? అన్న ప్రశ్నకు కూడా ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌పై యోగి తీవ్ర విమర్శలు చేశారు. గత ప్రభుత్వాల పాలనలో ఉత్తరప్రదేశ్‌లో జంగిల్ రాజ్, గూండారాజ్ కొనసాగాయని, తరచూ కర్ఫ్యూలు, దోపిడీలు జరిగేవని ఆరోపించారు. కుటుంబ, కుల రాజకీయాలతో రాష్ట్రాన్ని అభివృద్ధికి దూరం చేశారని విమర్శించారు. బీజేపీ పాలనలో రాష్ట్ర పరిస్థితులు మారాయని పేర్కొన్న యోగి.. ప్రజలు మరోసారి తమ ప్రభుత్వానికే పట్టం కడతారని విశ్వాసం వ్యక్తం చేశారు. మొత్తానికి, ఉత్తరప్రదేశ్‌లో మూడోసారి అధికారమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తుండగా.. యోగి ప్రకటించిన 320 సీట్ల అంచనా రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది.

banner

You may also like

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More