Wednesday, July 15, 2026
Chat on WhatsApp
HomeTechnology Newsరీసెర్చ్ వేగాన్ని పెంచనున్న Claude Science.. Anthropic కీలక ప్రకటన

రీసెర్చ్ వేగాన్ని పెంచనున్న Claude Science.. Anthropic కీలక ప్రకటన

-

Chat on WhatsApp

పరిశోధన రంగంలో AI వినియోగాన్ని విస్తరించే దిశగా ఆంత్రోపిక్‌(Anthropic) మరో కీలక అడుగు వేసింది. శాస్త్రవేత్తల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ‘క్లాడ్ సైన్స్’ (Claude Science) అనే కొత్త AI వర్క్‌బెంచ్‌ను కంపెనీ ప్రారంభించింది. ఇది కొత్త AI మోడల్ కాకుండా, ఇప్పటికే అందుబాటులో ఉన్న Claude సిరీస్ సామర్థ్యాలను శాస్త్రీయ పరిశోధనల కోసం సమర్థంగా వినియోగించే ప్రత్యేక వర్క్‌బెంచ్‌గా రూపొందించబడింది. ముఖ్యంగా జీవశాస్త్రం, బయోమెడికల్ పరిశోధనలు, కంప్యూటేషనల్ సైన్స్ వంటి రంగాల్లో పనిచేసే పరిశోధకులకు ఇది ఉపయోగపడేలా రూపొందించారు.

‘క్లాడ్ సైన్స్’ ద్వారా పరిశోధకులు 60కు పైగా శాస్త్రీయ డేటాబేస్‌లను ఒకే వేదికపై ఉపయోగించుకోవచ్చు. జీనోమిక్స్, ప్రోటీన్ నిర్మాణ విశ్లేషణ, రసాయన శాస్త్రం వంటి విభాగాలకు అవసరమైన టూల్స్ ముందుగానే ఇందులో అందుబాటులో ఉంటాయి. ప్రధాన AI అసిస్టెంట్ పరిశోధన పనులను సమన్వయం చేస్తూ, అవసరాన్ని బట్టి ప్రత్యేక AI ఏజెంట్లకు బాధ్యతలను అప్పగిస్తుంది.

దీంతో క్లిష్టమైన పరిశోధనా ప్రక్రియ మరింత సులభంగా పూర్తవుతుంది. ఈ వేదికలో మరో ముఖ్యమైన ప్రత్యేకత ఫ్యాక్ట్ వెరిఫికేషన్ వ్యవస్థ. పరిశోధనా నివేదికల్లో ఉపయోగించిన సైటేషన్లు, గణాంకాలు, లెక్కలను మరో AI స్వతంత్రంగా తనిఖీ చేసి పొరపాట్లను గుర్తిస్తుంది. అలాగే రూపొందించిన కోడ్ ఎలా పనిచేస్తుందో సాధారణ భాషలో వివరణ ఇవ్వడం వల్ల పరిశోధనను ఇతరులు తిరిగి పునరావృతం చేయడం సులభమవుతుంది. డేటా భద్రతపై కూడా ఆంత్రోపిక్‌ ప్రత్యేక దృష్టి పెట్టింది.

పరిశోధనకు సంబంధించిన సమాచారం కంపెనీ సర్వర్లకు వెళ్లకుండా, వినియోగదారుల సొంత కంప్యూటింగ్ వ్యవస్థలపైనే ప్రాసెస్ అయ్యేలా ఈ ప్లాట్‌ఫారమ్‌ను రూపొందించింది. దీంతో గోప్యతతో పాటు ప్రాసెసింగ్ వేగం కూడా మెరుగవుతుందని కంపెనీ వెల్లడించింది. ప్రస్తుతం ‘క్లాడ్ సైన్స్’ బీటా దశలో Pro, Max, Team, Enterprise సబ్‌స్క్రైబర్లకు అందుబాటులో ఉంది.

శాస్త్రీయ పరిశోధనలను ప్రోత్సహించేందుకు ఎంపికైన 50 ప్రాజెక్టులకు గరిష్ఠంగా 30 వేల అమెరికన్ డాలర్ల విలువైన క్రెడిట్లను అందించనున్నట్లు Anthropic ప్రకటించింది. బయోమెడికల్, పోస్ట్‌డాక్టరల్, గ్రాడ్యుయేట్ పరిశోధనలకు సంబంధించిన దరఖాస్తులను జూలై 15 వరకు స్వీకరించనున్నట్లు వెల్లడించింది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

mega star chiranjeevi

Chiranjeevi: ముద్రగడ పద్మనాభంది రాజీపడని వ్యక్తిత్వం.. చిరంజీవి భావోద్వేగ వ్యాఖ్యలు 

కాపు ఉద్యమానికి చిరునామాగా నిలిచిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (73) మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన...
- Advertisement -
Chat on WhatsApp