Sunday, July 26, 2026
Chat on WhatsApp
HomeAndhra PradeshVisakhapatnam Steel Plant | విశాఖ స్టీల్ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం… కార్మికుల పరిస్థితిపై ఆందోళన

Visakhapatnam Steel Plant | విశాఖ స్టీల్ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం… కార్మికుల పరిస్థితిపై ఆందోళన

-

Chat on WhatsApp

Visakhapatnam Steel Plant: సోమవారం విశాఖలోని ప్రతిష్టాత్మక స్టీల్ ప్లాంట్‌లో పెద్ద అగ్ని ప్రమాదం సంభవించింది. స్టీల్ మెల్టింగ్ షాప్–1 (SMS-1) పరిధిలోని సీసీడీ విభాగంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో ప్లాంట్ అంతటా ఒక్కసారిగా తీవ్ర ఆందోళన నెలకొంది.

ప్రాథమిక సమాచారం ప్రకారం, హాట్ మెటల్ రవాణా చేస్తున్న ల్యాడిల్/కన్వేయర్ వ్యవస్థలో యాంత్రిక సమస్య ఏర్పడినట్లు సమాచారం. ఈ లోపం కారణంగా భారీ పరిమాణంలో ద్రవ ఉక్కు కింద పడిపోవడంతో అక్కడే పనిచేస్తున్న కార్మికులు ప్రమాదానికి గురయ్యారు. ఘటనలో వెంటనే మంటలు వ్యాపించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న వెంటనే ప్లాంట్ భద్రతా సిబ్బంది, అగ్నిమాపక దళాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేపట్టాయి.

గాయపడిన కార్మికులను వెంటనే సమీప ఆసుపత్రులకు తరలించినట్లు తెలుస్తోంది. అయితే గాయపడిన వారి సంఖ్యపై అధికారిక వివరాలు ఇంకా వెలువడలేదు. ప్రమాదం సమయంలో కొందరు కార్మికులు అగ్నికీలల్లో చిక్కుకున్నారని స్థానిక వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు సుమారు 8 మంది కార్మికులు మృతి చెందినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ, దీనిపై అధికారిక నిర్ధారణ ఇంకా రాలేదు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

ఈ ఘటనతో విశాఖ స్టీల్ ప్లాంట్ భద్రతా ప్రమాణాలపై మరోసారి ప్రశ్నలు తలెత్తాయి. అధికారులు ప్రమాదానికి గల అసలు కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు అధికారిక ప్రకటన తర్వాత వెల్లడయ్యే అవకాశం ఉంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

- Advertisement -
Chat on WhatsApp