Sunday, July 26, 2026
Chat on WhatsApp
HomeENTERTAINMENTVijay Rashmika Wedding | టెంపుల్ నగలతో ట్రెండ్ సెట్ చేసిన విజయ్-రష్మిక

Vijay Rashmika Wedding | టెంపుల్ నగలతో ట్రెండ్ సెట్ చేసిన విజయ్-రష్మిక

-

Chat on WhatsApp

Vijay Rashmika Wedding: విజయ్ దేవరకొండ-రష్మిక మందన్న ల వివాహం రాజసంగా మెరిసింది. ఫిబ్రవరి 26, 2026న ఉదయపూర్ (Udaipur)లో జరిగిన ఈ వేడుక హై ఫ్యాషన్‌కు కొత్త అర్థం చెప్పింది.

మినిమల్ ట్రెండ్ నడుస్తున్న కాలంలో ఈ జంట మాత్రం కిలోల బంగారు టెంపుల్ నగలతో రాయల్ లుక్‌లో అందరినీ ఆకట్టుకున్నారు. మాంగ్ టిక్కా నుంచి పాదాల కడాల వరకు సంప్రదాయ శైలిలో అలంకరించుకున్నారు.

హైదరాబాద్‌కు చెందిన శ్రి జువెల్లర్స్ రూపొందించిన ఈ ఆభరణాల డిజైన్‌కు 10 నెలల సమయం పట్టిందని మేనేజింగ్ డైరెక్టర్లు అభిషేక్ అగర్వాల్, కౌశిక్ కుమార్ తెలిపారు. వరుడు విజయ్ ధరించిన మాక్సిమలిస్ట్ స్టైల్ నగలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

నాణెం సైజ్ స్టడ్స్, భారీ కఫ్, పొడవైన హారాలు, బాజుబంద్, కడాలు ధరించి పౌరాణిక రాజుల లుక్‌ను తలపించారు. ఏనుగు, పులి మోటిఫ్‌లు, డీప్ నక్షి వర్క్ నగలకు ప్రత్యేక శోభనిచ్చాయి.

వధువు రష్మిక దక్షిణ భారత శిల్పకళ స్ఫూర్తితో రూపొందించిన 11 ఆభరణాలు ధరించారు. చోకర్, జుమ్కాలు, జడాబిల్ల, మాథాపట్టి, వడ్డాణం, పాదసరాలు యాంటిక్ మ్యాట్ ఫినిష్‌లో మెరిశాయి.

ప్రతి నగలో నక్షి, రవ్వ పనితనం స్పష్టంగా కనిపించింది. ఈ రాజసమైన టెంపుల్ జ్యువెలరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది.

ALSO READ:Delhi Liquor Policy case | నిజం గెలిచింది…భావోద్వేగంగా కవిత

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

- Advertisement -
Chat on WhatsApp