గన్నవరం టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్న సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీ విజయవాడ జైల్లో రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. రేపటితో ఆయన రిమాండ్ ముగుస్తుండటంతో ఈ కేసుకు సంబంధించి పోలీసులు వంశీని 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై కోర్టు విచారణ పూర్తయింది, ఇవాళ తీర్పు వెలువడే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే, గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సీఐడీ అధికారులు వల్లభనేని వంశీపై పీటీ వారెంట్ జారీ చేశారు. ఈ నేపథ్యంలో రేపు వంశీని కోర్టులో హాజరుపరచాలని థర్డ్ ఏసీఎం కోర్టు ఆదేశించింది. సీఐడీ విచారణకు సిద్ధమవుతోంది.
ఈ కేసులో వంశీ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా, హైకోర్టు ఆయన పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో వంశీపై మరిన్ని కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.
కోర్టు తీర్పు ఏ విధంగా ఉంటుందన్న ఉత్కంఠ నెలకొంది. వంశీకి కస్టడీ మంజూరు అయితే, అతడిపై మరిన్ని కేసులు నమోదు చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.