Saturday, July 11, 2026
Chat on WhatsApp
HomeNationalTVK Vijay Statue | విజయ్ రాకపోతే విగ్రహమే సరిపోతుంది...విగ్రహంతో ఓట్ల వేట

TVK Vijay Statue | విజయ్ రాకపోతే విగ్రహమే సరిపోతుంది…విగ్రహంతో ఓట్ల వేట

-

Chat on WhatsApp

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రచారం కొత్త మలుపులు తిరుగుతుంది. ప్రధాన పార్టీలు ఓట్ల కోసం హోరాహోరీగా ప్రచారం సాగిస్తుండగా, నటుడు విజయ్ స్థాపించిన tvk పార్టీ తరఫున ఒక అభ్యర్థి వినూత్న ప్రచారంతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.

తిరువేరుంపూర్ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న నవల్పట్టు విజి, విజయ్ తన ప్రాంతానికి రాలేకపోవడంతో ఆయన విగ్రహాన్నే ప్రచార(TVK Vijay Statue) ఆయుధంగా మార్చుకున్నారు.

విజయ్‌ను పోలిన భారీ విగ్రహాన్ని ఓపెన్ వాహనంలో ఏర్పాటు చేసి నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. నామినేషన్ దాఖలు సమయంలోనూ ఇదే శైలిని అనుసరించగా, ప్రస్తుతం రోజువారీ ఎన్నికల ప్రచారంలో కూడా అదే విగ్రహాన్ని వెంట తీసుకెళ్తున్నారు.

విజయ్ రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో బిజీగా ఉండటంతో, అభిమాన భావనతోనే ఈ ప్రయత్నం చేస్తున్నామని అభ్యర్థి చెబుతున్నారు.

ఈ ప్రచారానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి. మరోవైపు, కొంతమంది tvk అభ్యర్థులు విజయ్‌లా కనిపించే వ్యక్తులను కూడా ప్రచారంలోకి దింపుతూ ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.

మొత్తానికి, ఈ ఎన్నికల్లో విజయ్ ప్రత్యక్షంగా ఎంత ప్రభావం చూపుతారన్నదానికంటే, ఆయన ఇమేజ్ ఎంతవరకు ఓట్లుగా మారుతుందన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

telangana chief minister revanth reddy predicts 2029 assembly elections

CM Revanth Reddy | వచ్చే ఎన్నికల్లో 182 అసెంబ్లీ స్థానాల్లో 117 కాంగ్రెస్‌వే.....

CM Revanth Reddy: ఖమ్మం జిల్లాలో నిర్వహించిన రైతు ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల షెడ్యూల్, కాంగ్రెస్ భవిష్యత్తు, బీఆర్‌ఎస్‌పై తన రాజకీయ అంచనాలను వెల్లడించారు. దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన...
- Advertisement -
Chat on WhatsApp