Saturday, July 11, 2026
Chat on WhatsApp
HomeNationalTVK Vijay | ఎన్నికల ముందే టీవీకేకు దెబ్బ.. నామినేషన్లు తిరస్కరణ

TVK Vijay | ఎన్నికల ముందే టీవీకేకు దెబ్బ.. నామినేషన్లు తిరస్కరణ

-

Chat on WhatsApp

TVK Vijay: తమిళ రాజకీయాల్లో అడుగుపెట్టిన టీవీకే పార్టీకి ఎన్నికల ముందే ఊహించని షాక్ తగిలింది. ఎడప్పాడి నియోజకవర్గంలో ఆ పార్టీ తరఫున దాఖలైన ప్రధాన అభ్యర్థి, ప్రత్యామ్నాయ అభ్యర్థి నామినేషన్లను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. దీంతో టీవీకేకు పోటీ ప్రారంభమయ్యేలోపే ఒక కీలక సీటు దూరమైన పరిస్థితి ఏర్పడింది.

అధికారిక సమాచారం ప్రకారం, టీవీకే అభ్యర్థి అరుణ్‌కుమార్ నామినేషన్ పత్రాల్లో ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా అవసరమైన ప్రతిపాదకుల సంతకాలు పూర్తి కాలేదు. నిబంధనల ప్రకారం కనీసం 10 మంది ప్రతిపాదకుల సంతకాలు తప్పనిసరిగా ఉండాలి. అయితే ఆయన దాఖలు చేసిన పత్రాల్లో కేవలం 8 సంతకాలు మాత్రమే ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

ఇక ప్రత్యామ్నాయ అభ్యర్థిగా నామినేషన్ వేసిన నిత్య పత్రాల్లో కూడా ఇదే లోపం బయటపడింది. ఆమె నామినేషన్‌లో కేవలం 7 మంది ప్రతిపాదకుల సంతకాలు మాత్రమే ఉండటంతో, ఎన్నికల సంఘం దానినీ చెల్లనిదిగా ప్రకటించింది.

ఈ పరిణామం టీవీకే చీఫ్ విజయ్ కు రాజకీయంగా పెద్ద ఎదురుదెబ్బగా మారింది. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న వేళ, ప్రాథమిక నిబంధనల విషయంలో చోటుచేసుకున్న ఈ నిర్లక్ష్యం పార్టీకి ఇబ్బందికరంగా మారింది. ఎడప్పాడిలో ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

telangana chief minister revanth reddy predicts 2029 assembly elections

CM Revanth Reddy | వచ్చే ఎన్నికల్లో 182 అసెంబ్లీ స్థానాల్లో 117 కాంగ్రెస్‌వే.....

CM Revanth Reddy: ఖమ్మం జిల్లాలో నిర్వహించిన రైతు ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల షెడ్యూల్, కాంగ్రెస్ భవిష్యత్తు, బీఆర్‌ఎస్‌పై తన రాజకీయ అంచనాలను వెల్లడించారు. దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన...
- Advertisement -
Chat on WhatsApp