Thursday, July 2, 2026
Chat on WhatsApp
HomeInterNationalDonald Trump | ఇరాన్‌పై మళ్లీ వైమానిక దాడులా?.. అమెరికా సన్నాహాలు వేగం

Donald Trump | ఇరాన్‌పై మళ్లీ వైమానిక దాడులా?.. అమెరికా సన్నాహాలు వేగం

-

Chat on WhatsApp

ఇరాన్ అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) కీలక నిర్ణయాలకు సిద్ధమవుతున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. దౌత్యపరమైన చర్చలు విఫలమైతే ఇరాన్‌పై వైమానిక దాడులను మళ్లీ ప్రారంభించే అవకాశాన్ని అమెరికా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ది న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం, పెంటగాన్ ఇప్పటికే వివిధ అత్యవసర పరిస్థితులకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది.

‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ పేరుతో గతంలో రూపొందించిన సైనిక వ్యూహాన్ని మళ్లీ అమలు చేసే అవకాశాలపై కూడా చర్చ జరుగుతున్నట్లు సమాచారం. గత కాల్పుల విరమణ తర్వాత అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త సైనిక విన్యాసాలు మరింత వేగవంతం కావడం ప్రాంతీయ ఉద్రిక్తతలకు దారితీస్తోందని నిఘా వర్గాలు చెబుతున్నాయి.

ఇక చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో ట్రంప్ ఇటీవల జరిపిన సమావేశంలో కూడా ఇరాన్ పరిస్థితి, హోర్ముజ్ జలసంధి భద్రత వంటి అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. “ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండకూడదు” అనే విషయంలో అమెరికా, చైనా నాయకులు ఒకే అభిప్రాయానికి వచ్చినట్లు ట్రంప్ వెల్లడించారు. అయితే టెహ్రాన్‌పై ఒత్తిడి తేవాలని చైనాను తాను కోరలేదని స్పష్టం చేశారు.

ఇరాన్ నుంచి వచ్చిన తాజా శాంతి ప్రతిపాదనపై కూడా ట్రంప్ కఠిన వైఖరిని ప్రదర్శించారు. ప్రతిపాదనలోని అంశాలు నచ్చకపోతే వెంటనే తిరస్కరిస్తానని ఆయన వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో ట్రంప్-షి చర్చల్లో తైవాన్ అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది.

తైవాన్ స్వాతంత్ర్య అంశం పెద్ద ఘర్షణలకు దారితీసే అవకాశం ఉందని షీ హెచ్చరించినట్లు సమాచారం. ఇరాన్, తైవాన్ అంశాలపై ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ, రెండు దేశాల నాయకులు పరస్పర అవగాహనతో ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

- Advertisement -
Chat on WhatsApp