Saturday, July 11, 2026
Chat on WhatsApp
HomeNationalFastag | ఫాస్టాగ్ లేకుంటే ఇబ్బందే...ఏప్రిల్ 1 నుంచి టోల్ ప్లాజాల వద్ద కొత్త రూల్స్

Fastag | ఫాస్టాగ్ లేకుంటే ఇబ్బందే…ఏప్రిల్ 1 నుంచి టోల్ ప్లాజాల వద్ద కొత్త రూల్స్

-

Chat on WhatsApp

Fastag: దేశవ్యాప్తంగా హైవేలను వినియోగించే వాహనదారులకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) కీలక హెచ్చరిక జారీ చేసింది. ఏప్రిల్ 1, 2026 నుంచి దేశంలోని జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులను పూర్తిగా నిలిపివేయాలని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.

ఇకపై టోల్ ఫీజులను కేవలం ఫాస్టాగ్ లేదా యూపీఐ ద్వారా మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిర్ణయంతో టోల్ గేట్ల వద్ద వాహనాల రద్దీ తగ్గడంతో పాటు, ప్రయాణ సమయం కూడా ఆదా అవుతుందని అధికారులు భావిస్తున్నారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 98 శాతం టోల్ లావాదేవీలు ఇప్పటికే ఫాస్టాగ్ ద్వారా జరుగుతున్నాయని నివేదికలు సూచిస్తున్నాయి.

ఇప్పటివరకు ఫాస్టాగ్ లేని వాహనదారులు నగదు రూపంలో రెట్టింపు టోల్ చెల్లించి వెళ్లే అవకాశం ఉండేది. అలాగే కొన్ని సందర్భాల్లో యూపీఐ చెల్లింపులకు 1.25 రెట్లు టోల్ వసూలు చేసే విధానం అమల్లో ఉంది.

అయితే తాజా మార్పుల ప్రకారం నగదు చెల్లింపులకు పూర్తిగా చెక్ పెట్టి, 100 శాతం డిజిటల్ టోల్ సిస్టమ్ వైపు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. టోల్ లేన్లలో క్యాష్ వల్లే ఎక్కువగా జాప్యం, క్యూలు, వివాదాలు తలెత్తుతున్నాయని NHAI భావిస్తోంది.

ఒకవేళ ఫాస్టాగ్ పని చేయకపోయినా లేదా బ్యాలెన్స్ లేకపోయినా, వాహనదారులు టోల్ ప్లాజాల వద్ద అందుబాటులో ఉండే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి యూపీఐ ద్వారా తక్షణమే చెల్లింపులు చేయవచ్చు. అందువల్ల ప్రయాణానికి బయలుదేరే ముందు ఫాస్టాగ్ వాలెట్‌లో సరిపడా బ్యాలెన్స్ ఉందో లేదో చెక్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

అలాగే తరచుగా హైవే ప్రయాణాలు చేసే ప్రయాణికులు ఫాస్టాగ్ యాన్యువల్ పాస్, రీఛార్జ్ సదుపాయాలపై కూడా ముందుగానే అవగాహన కలిగి ఉండటం మంచిదని చెబుతున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

telangana chief minister revanth reddy predicts 2029 assembly elections

CM Revanth Reddy | వచ్చే ఎన్నికల్లో 182 అసెంబ్లీ స్థానాల్లో 117 కాంగ్రెస్‌వే.....

CM Revanth Reddy: ఖమ్మం జిల్లాలో నిర్వహించిన రైతు ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల షెడ్యూల్, కాంగ్రెస్ భవిష్యత్తు, బీఆర్‌ఎస్‌పై తన రాజకీయ అంచనాలను వెల్లడించారు. దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన...
- Advertisement -
Chat on WhatsApp