Wednesday, July 15, 2026
Chat on WhatsApp
HomeTelanganaTahsildars | రాష్ట్రవ్యాప్తంగా తహశీల్దార్‌ల బదిలీలు.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

Tahsildars | రాష్ట్రవ్యాప్తంగా తహశీల్దార్‌ల బదిలీలు.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

-

Chat on WhatsApp

Tahsildars: తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖలో ప్రభుత్వం కీలక పరిపాలనా నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో పనిచేస్తున్న 12 మంది తహశీల్దార్లను బదిలీ చేస్తూ బుధవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. పరిపాలనా అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ బదిలీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. బదిలీ అయిన అధికారులకు తక్షణమే అమల్లోకి వచ్చేలా డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్లు (DRO), స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు (SDC – Land Acquisition) వంటి కొత్త బాధ్యతలను అప్పగించారు.

ఈ బదిలీలపై పూర్తి నివేదికతో పాటు అధికారులు విధుల్లో చేరిన వివరాలను వెంటనే ప్రభుత్వానికి సమర్పించాలని భూపరిపాలన ప్రధాన కమిషనర్ (CCLA) మరియు జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది.

కొత్త ఉత్తర్వుల ప్రకారం నిర్మల్ తహశీల్దార్ మోతీరామ్ ఎ.ను మంచిర్యాల డీఆర్ఓగా నియమించారు. కరీంనగర్‌కు చెందిన బి. రాజేశ్వరి పెద్దపల్లి డీఆర్ఓగా, పెద్దపల్లి కె.వై. ప్రసాద్ జగిత్యాల డీఆర్ఓగా బదిలీ అయ్యారు.

అలాగే వనపర్తి ఆర్. పాండు నాగర్‌కర్నూల్ డీఆర్ఓగా, ఖమ్మం వి. రవికుమార్ ములుగు డీఆర్ఓగా, మేడ్చల్-మల్కాజిగిరి జె. స్వామి కరీంనగర్ డీఆర్ఓగా నియమితులయ్యారు. నాగర్‌కర్నూల్ ఎ. పాండు కామారెడ్డి డీఆర్ఓగా బదిలీ అయ్యారు.

ఇక జనగామ తహశీల్దార్ సిహెచ్. శ్రీకాంత్‌ను మహబూబ్‌నగర్ స్పెషల్ కలెక్టర్ పీఏగా నియమించగా, సూర్యాపేట ఎం. సుదర్శన్ రెడ్డిని సిద్దిపేట ఎస్డీసీగా, ఖమ్మం ఎం. రమాదేవిని నల్గొండ ఎస్డీసీగా బదిలీ చేశారు. పెద్దపల్లి జి. కుమారస్వామిని సిరిసిల్ల ఎస్డీసీగా, కరీంనగర్ ఎన్. వెంకట్ రెడ్డిని కరీంనగర్ ఎస్డీసీ (ఎల్ఏ)గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

- Advertisement -
Chat on WhatsApp