Sunday, July 12, 2026
Chat on WhatsApp
HomeTechnology NewsWhatsapp Update | వాట్సాప్‌లో కొత్త యూజర్‌నేమ్ ఫీచర్.. మొబైల్ నంబర్‌కు గుడ్‌బై?

Whatsapp Update | వాట్సాప్‌లో కొత్త యూజర్‌నేమ్ ఫీచర్.. మొబైల్ నంబర్‌కు గుడ్‌బై?

-

Chat on WhatsApp

Whatsapp Update: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగిస్తున్న ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. టెలిగ్రామ్, సిగ్నల్ వంటి యాప్‌లలో ఉన్న విధంగా యూజర్‌నేమ్ ఎంపిక చేసుకునే సదుపాయాన్ని త్వరలో వినియోగదారులకు అందించనుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ పరీక్షల దశలో ఉండగా, వివిధ మొబైల్ పరికరాల్లో ట్రయల్స్ నిర్వహిస్తున్నట్లు సమాచారం.

మొబైల్ నంబర్ లేకుండానే చాట్ చేసే అవకాశం

ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత వినియోగదారులు తమ మొబైల్ నంబర్‌ను ఇతరులకు కనిపించకుండా గోప్యంగా ఉంచుకోవచ్చు. చాట్‌లలో ఫోన్ నంబర్ స్థానంలో కేవలం యూజర్‌నేమ్ మాత్రమే కనిపించనుంది. దీంతో వ్యక్తిగత సమాచార భద్రత మరింత పెరగనుందని వాట్సాప్ భావిస్తోంది. సైబర్ నేరాల నుంచి యూజర్లను రక్షించడంలో ఈ ఫీచర్ కీలక పాత్ర పోషించనుందని సంస్థ పేర్కొంటోంది.

యూజర్‌నేమ్ ఎంపికకు నియమాలు

యూజర్‌నేమ్ ఎంపిక కోసం కొన్ని నియమాలను కూడా వాట్సాప్ రూపొందిస్తోంది. కనీసం ఒక అక్షరం తప్పనిసరి కాగా, “www”తో ప్రారంభమయ్యే పేర్లు అనుమతించబడవు. చిన్న అక్షరాలు (a–z), సంఖ్యలు (0–9), డాట్‌లు, అండర్‌స్కోర్‌లను మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. దీంతో ఒకేలా కనిపించే ఖాతాల వల్ల గందరగోళం తగ్గే అవకాశం ఉంది.

ఆన్‌లైన్ స్టేటస్ కొత్త ఫీచర్

ఇదే కాకుండా మరో కొత్త ఫీచర్‌ను కూడా వాట్సాప్ పరీక్షిస్తోంది. ఫేస్‌బుక్ మెసెంజర్ తరహాలో ఎవరు ఆన్‌లైన్‌లో ఉన్నారో ఒకేచోట చూసే అవకాశం కల్పించనుంది. ఇప్పటివరకు ఈ సమాచారం తెలుసుకోవాలంటే ప్రతి చాట్‌ను ఓపెన్ చేయాల్సి వచ్చేది. కొత్త అప్‌డేట్‌తో ఆన్‌లైన్ యూజర్లను ప్రత్యేకంగా వీక్షించవచ్చు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

ins-mahendragiri-inducted-into-indian-navy-rajnath-singh

Rajnath Singh | సముద్రంలో భారత్‌కు తిరుగులేదు.. రాజ్‌నాథ్ సింగ్ కీలక ప్రకటన

Rajnath Singh: భారత సముద్ర భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక అడుగు పడింది. విశాఖపట్నంలోని నావల్ డాక్‌యార్డ్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి భారత నౌకాదళంలో కొత్తగా...
- Advertisement -
Chat on WhatsApp